
- భూసార పరీక్షలద్వారా రైతులు నేల స్వభావాన్ని తెలుసుకోవాలి. ఆ ఫలితం ఆధారంగా పంటల సాగు చేపట్టి, అవసరమైన ఎరువులను సరైన మోతాదులో మాత్రమే వేయాలి.
- – కిరణ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త
ఆంధ్రప్రదేశలో మే నెల సాధారణ వర్షపాతం 68.9 మిల్లీమీటర్లు కాగా 93.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. అలాగే ఈ నెల తొలి పక్షంలోనూ సాధారణ వర్షపాతం 44మిల్లీమీటర్లకుగాను 58.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ నేపథ్యంలో రైతులు కింది సూచనల మేరకు పంటలు వేసుకోవచ్చు.
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ మా గాణుల్లో జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తుకోవచ్చు. మెట్టలో వేరుశనగ, మొ క్కజొన్న, జొన్న, సజ్జ, రాగు, కంది, మినుము, పెసర వేసుకోవచ్చు. ఎత్తయి న గిరిజన మండలం పోడుసాగు, మి శ్రమ పంటలకు అనుకూలం. వేరుశనగ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, చెర కు సాగు చేయవచ్చు.
- ఉభయగోదావరి జిల్లాల్లో పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు. మూడోవారం వెదపద్ధతిలో వరి విత్తడానికి అనుకూలం. చిరుధాన్యాలు, అపరా లు, మొక్కజొన్న సాగు చేపట్టవచ్చు.
- కృష్ణా, గుంటూరు, ప్రకాశం మాగాణుల్లో ఖరీఫ్ వరికి ముందు పచ్చిరొట్ట వేసుకోవచ్చు. సాగర్ ఆయకట్టులో నువ్వు, పెసర వంటి పైర్లు వేసుకోవచ్చు.
- మెట్టప్రాంతాల్లోని నల్లరేగడి భూముల్లో అపరాలకు పరిస్థితి అనుకూలంగా ఉంది.
- ఎరుపు, తేలికపాటి నేలల్లో అపరాలు, చిరుధాన్యాలతోపాటు కందిలో అంతరపంటలు వేయొచ్చు.
- నెల్లూరు, చిత్తూరు, కడప మెట్టభూముల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, మినుము, కంది, నువ్వు వేయవచ్చు. నెల్లూరు జిల్లా మాగాణి వరినాట్లు, పచ్చిరొట్టకు అనుకూలం.
- కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదంతోపాటు మినుము, కంది, నువ్వు విత్తుకోవచ్చు.
ఖరీ్‌ఫ అనుకూల వరి వంగడాలు
కృష్ణా, గుంటూరు, ప్రకాశంలలో స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, విజేత, దీప్తి, బాపట్ల సన్నాలు, ఇంద్ర, శ్రీరంగ, నెల్లూరు9674, స్వర్ణముఖి, అక్షయ, నెల్లూరు సోనా, భావపురి సన్నాలు. గోదావరి జిల్లాల్లో స్వర్ణ, చైతన్య, కృష్ణవేణి, విజేత, గోదావరి, తొలకరి, ఇంద్ర, అమర, అక్షయ, నెల్లూరు సోనా; ఉత్తరకోస్తాలో శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, చైతన్య, వసుంధర, సోనామసూరి, శ్రీకూర్మ, విజేత, వంశధార; నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సింహపురి, తిక్కన, సావిత్రి, శ్రీరంగ, నెల్లూరు9674, పార్థివ, నెల్లూరు సోనా; కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాంబమసూరి, సోనామసూరి, దీప్తి, నంద్యాల సన్నాలు, నెల్లూరు సోనా, నెల్లూరు మసూరి; గిరిజన ప్రాంతాల్లో శ్రీకాకుళం సన్నాలు, వసుంధర, విజేత, నెల్లూరు మసూరి, సుగంధసాంబ, జగిత్యాల సన్నాలు.
- మొక్కజొన్న.. డీహెచఎం 111, 113, 115, 117, 119, 121 రకాలు.
- సజ్జ.. హెచహెచబీ67, ఐసీఎంహెచ356, ఆర్ హెచబీ121, ఐసీటీపీ8203, 221, ఐహెచబీ3.
- రాగులు.. గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీచైతన్య.
- కంది.. ఎల్‌ఆర్‌జీ41, ఎల్‌ఆర్‌జీ52, ఆశ, మారు తి, ఐసీపీఎల్ 85063, పీఆర్జీ158, పీఆర్జీ176.
- మినుము.. ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, టీ 9, పీయూ 31, ఎల్బీజీ 787 రకాలు.
- పెసర.. ఎల్జీజీ 407, 410, 450, 460, టీఎం 96-2, డబ్ల్యూజీజీ 42 రకాలు.
- జొన్న.. సీఎ్సహెచ 4, 16, 18, పీఎ్‌సవీ 1, సీఎ్సవీ 15, పాలెం 2 రకాలు.
Credits : Andhrajyothi