ఇంట్లో పచ్చని అందాలు

వంట ఇంట్లో, డైనింగ్‌ టేబుల్‌ మీద, టీవీ పక్కన, మెట్ల పక్కన అందమైన చిన్న కుండీలలో పెంచుకునే మొక్కలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. పెద్దగా శ్రమ లేకుండా పెంచుకునే అవకాశం ఉండడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు సైతం వీటినాదరిస్తున్నారు.
నాలుగ్గోడల మధ్య పెంచుకునే మొక్కలకు క్రేజ్‌ పెరుగుతోంది. ఇండ్లలోను, పోర్టికోలలోను, బెడ్‌రూమ్‌లలోను, హాళ్ళలోను, ప్రభుత్వ కార్యాలయాల్లోను చక్కగా కొలువుదీరి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చిన్న సైజులో చూడముచ్చటగా ఉండడంతో పాటు పచ్చదనాల ఆహ్లాదాన్ని పంచే ఈ మలేషియా మొక్కలను ఇటీవల కడియం నర్సరీ రైతులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. గతంలో కూడా ఇండోర్‌ ప్లాంట్స్‌ ఉన్నప్పటికీ పెద్దసైజులో ఎక్కువ ఎత్తులో పెరిగేవి. వాటిని పడక గదుల్లోను, కప్‌బోర్డుల్లోను ఉంచుకోవడం కష్టమమ్యేది. తాజాగా వచ్చిన ఈ మొక్కలతో అన్నిచోట్లా అమర్చుకోవడానికి అవకాశం ఉండటంతో వనప్రియులు ఈ మొక్కల పట్ల ఆసక్తి చూపుతున్నారు.
బడ్నస్‌ ఫెర్న్‌ : తక్కువ పరిమాణంలో ఏడాదికి సుమారు అరడుగు వరకు పెరుగుతుంది. 15 రోజుల కొకసారి నీరు పోయాలి. ఈ మొక్కకు కొబ్బరిపొట్టు, పీచు వేసుకుంటే మంచిది. వాటిపై అలంకరణగా రంగురంగుల రాళ్ళు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాయి.
డ్రసీనియా సికిందర్‌ : తక్కువ ఎత్తులో ఏడాదికి అరడుగు పెరుగుతుంది.
సుమారు 15 రోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. మధ్యలో మొక్కకు తేమ అందేలా పెభాగం నుండి కొద్దిగా నీరు చిలకరించాలి.
 
బడ్నస్‌ వెరిగేటా : ఇది తక్కువ ఎత్తు పెరుగుతుంది. స్ర్పేతో నీరు అందివ్వాలి. ఆకు చిగురుభాగం నుండి నీరు ఇవ్వాలి.
 
బడ్నస్‌ గుడ్‌డే : ఇది ఏడాదికి అరడుగు ఎత్తు వరకు పెరుగుతుంది.
15 రోజుల కొకసారి అంటే మొక్కలో నీరు పూర్తిగా ఇంకిపోయిన తరువాత ఇవ్వాలి.
 
మనీప్లాంట్‌ గోల్డ్‌ : గతంలో మనీప్లాంట్‌ మొక్క పచ్చదనంతో ఉండేది. ఈ కొత్త మొక్క ఆకులు బంగారు రంగులో ఉండటం చేత మనీప్లాంట్‌గోల్డ్‌గా దీనిని పిలుస్తారు. ఈ మొక్కకు కూడా పై మొక్కల మాదిరిగానే 15 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. మిగిలిన రోజుల్లో నీరు కొద్దిగా మొక్క పైభాగంలో చిలకరించాలి.
 
ప్రైపోమియా పింక్‌ : ఇది కూడా తక్కువ ఎత్తులో ఏడాదికి అరడుగు వరకు పెరుగుతుంది. ఆకులు పింక్‌రంగులోచూడముచ్చటగా ఉంటాయి.
Credits : Andhrajyothi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *