
రబీలో నారు ఎదగడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అలాగే ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన పద్ధతులేమిటి..?
– చెప్యాల పోచయ్య, రైతు, ఔరంగాబాద్
చలి ఎక్కువగా ఉండడం వల్ల వరినారు ముడుచుకుపోయి రంగు మారి సకాలంలో ఎదగదు. దీని నివారణకు రెండు గ్రాములు కర్పెండ్జిమ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు రాత్రిపూట నారుమడిలో నీరు లేకుండా చూసుకోవాలి. నారు మీద ఎండుగడ్డి కప్పాలి. వీటన్నింటితో పాటు బాగా ఎండబెట్టిన పశువుల పేడను నారుమళ్లలో చల్లాలి. బాగా చినికిన ఎఫ్వైఎంను వేసుకోవాలి. నారుమడిలో 2 కిలోల యూరియా, 2 కిలోల డీఏపీ, 1 కిలో పొటాష్ వేయాలి. జింక్లోపం కనిపిస్తే 100-150 గ్రాముల సల్ఫైట్ను స్ర్పే చేసుకోవాలి. మడి నుంచి నారు తీసే పది రోజుల ముందు మూడు కిలోల కార్బొపురన్ గుళికలను వాడడం వల్ల మొగి పురుగు నుంచి పంటను రక్షించుకోవచ్చు. 25 రోజులు దాటిన నారుపై 1 లీటర్ వేప నూనె లేదా క్లోరోఫైరిఫాస్ను స్ర్పే చేసుకోవాలి. నాట్లు వేసుకునే ముందు వరి కొనలు తుంచి నాట్లు వేయాలి. ఈ పద్ధతుల ద్వారా వరి నారుమళ్లను రక్షించుకోవచ్చు.
– పరుశురాం నాయక్, జిల్లా వ్యవసాయాధికారి
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్
Credits : Andhrajyothi