
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నంద్యాల: రోజుకు ఎనిమిది ఎకరాల్లో చెరుకు పంటను చకచకా కోసే యంత్రం అందుబాటులోకి వచ్చింది. డబ్బుతో పాటు సమయాన్ని ఆదా చేసే ఈ యంత్రం రైతుకు వరంగా మారింది.
చేతికి వచ్చిన చెరుకు పంటను కోసేందుకు ఇప్పుడు ఆధునిక యంత్రం రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రంతో రోజుకు ఆరు నుంచి ఎనిమిది ఎకరాల చెరుకు పంటను కోసే వీలుంది. చేతికి వచ్చిన చెరకు పంటను కోసేందుకు రైతులు కూలీల మీద ఆధారపడాల్సి వస్తున్నది. టన్ను చెరకు కోసేందుకు కూలీలకు 600 నుంచి 1000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తున్నది. కూలీల కొరత కారణంగా సకాలంలో పంటను కోయలేక రైతులు నష్టపోతున్నారు. ఈ తరుణంలో చెరుకు మిల్లుల యాజమాన్యాలు ఈ కోత యంత్రాన్ని రైతులకు పరిచయం చేశాయి. ఆధునిక పరిజ్ఞానంతో వచ్చిన ఈ యంత్రం వేగంగా చెరుకు కటింగ్ చేయడంతో రైతులకు ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతున్నాయి.
డబ్బు.. సమయం ఆదా

ఆధునిక యంత్రాల వినియోగం వల్ల రైతులకు నాణ్యమైన పంట చేతికి వస్తుంది. ఖర్చు తగ్గడంతో పాటు సకాలంలో పంటను కోసే అవకాశం వుంటుంది. దీని వల్ల రైతుకు డబ్బు, సమయం ఆదా అవుతుంది. రైతులంతా ఈ ఆధునిక యంత్రాలను ఉపయోగించుకోవాలి.
Credits : Andhrajyothi