పండ్ల తోటల సాగులో మేటి 

రసాయనిక ఎరువులు, పురుగు మందులను పరిమితంగా ఉపయోగిస్తూ, సేంద్రియ ఎరువులు, గోమూత్రం, చెట్ల ఆకుల కషాయాలతో పండ్ల తోటలు సాగుచేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు ఆ రైతు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా మక్కువతో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నల్లగొండ జిల్లా రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన శీలం ఆశోక్‌రెడ్డి.

పది ఎకరాల ఆసామి అశోక్‌రెడ్డి. ఎనిమిదేళ్ల క్రితం తన పొలంలో పండ్ల తోటల సాగుకు నడుంకట్టారాయన. అందరూ నడిచే దారిలో కాకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ పండ్ల తోటల్లో మంచి దిగుబడులు, అధిక లాభాలు గడిస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో వెయ్యి బత్తాయి చెట్లు, 25 జామ, 120 కొబ్బరి, 10 నిమ్మ, 5 సీతాఫల్‌, 10 ఉసిరి, 5 గిరక తాటిచెట్లతో సాగు ప్రారంభించారు అశోక్‌రెడ్డి. మరో 23 ఎకరాల భూమిని లీజ్‌కు తీసుకున్నారు. అందులో 7 వేల దానిమ్మ చెట్లు సాగు చేశారు. బత్తాయి, నిమ్మ, దానిమ్మ మొక్కలు ప్రభుత్వ నర్సరీలనుంచి తెచ్చి నాటారు. మల్లేపల్లి ఉద్యాన శాఖనుంచి బత్తాయిని, సంగారెడ్డి ప్రభుత్వ నర్సరీ నుంచి జామ మొక్కలను, మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ నుంచి సీతాఫల్‌, నిమ్మ మొక్కలను, గిరక తాటిచెట్లను నారాయణపేట నుంచి దిగుమతి చేసుకొని నాటారు. బత్తాయి తోటల్లో రసాయనాలు, ఎరువులు వేసే పద్ధతికి ఆయన స్వస్తి చెప్పారు. సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపారు. ఎకరానికి 25 నుంచి 30 టన్నుల వరకు పశువుల ఎరువు ఉపయోగించారు. పురుగుల మందుకు బదులుగా గోమూత్రం, సీతాఫల్‌, తంగేడు తదితర చెట్ల ఆకులతో కషాయాన్ని తయారుచేసి చెట్లకు 15 రోజులనుంచి నెలలోపు ఒకసారి పిచికారీ చేస్తున్నారు. దానికితోడు జనుము, జీలుగ విత్తనాలు సాగు చేసి పచ్చిరొట్ట్టగా వాడుతున్నారు. సేంద్రియ సేద్యం మంచి ఫలితాలు ఇవ్వడంతో గోమూత్రం, పశువుల ఎరువు కోసం ఏకంగా 15 దేశవాళీ ఆవులు కొనుగోలు చేశారు ఈ రైతు. గత ఏడాది 140 టన్నుల వరకు బత్తాయి దిగుబడి సాధించి సాటి రైతులకు ఆదర్శంగా నిలిచారాయన. ఎరువులు, రసాయనాల ఖర్చు లేకపోవడంతో ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయాన్ని సాధించారు ఈ రైతు. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలు సాగు విధానాలను గమనించేందుకు పలువురు ప్రముఖులు సోమారం గ్రామాన్ని తరచూ సందర్శిస్తుండటం విశేషం. – ఆంధ్రజ్యోతి, రాజాపేట (నల్గొండ జిల్లా)

వ్యవసాయం ఓ పండుగ 

పండ్ల తోటల సాగు చాలా లాభదాయకం. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడ కాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, గోమూత్రం వాడకాన్ని పెంచడం వల్ల దిగుబడులు పెరుగుతున్నాయి. ఖర్చు లు తగ్గి, లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రైతులందరూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచితే పెట్టుబడులు తగ్గి వ్యవసాయం పండుగ అవుతుంది. బత్తాయి మద్దతు ధర ఒకే తీరుగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది.
– శీలం అశోక్‌రెడ్డి, సోమారం
Credits : Andhrajyothi

ఆముదానికి సూక్ష్మనీటి సేద్యం

       ఆముదం సాగులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్‌ కె రాజారెడ్డి వివిధ సూచనలు ఇచ్చారు. వాటి వివరాలు…

రబీ ఆముదములో ఫిబ్రవరి నెల నుంచి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకొని 8-10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. బోదెలు, కాలువల ద్వారా నీరు ఇవ్వడం వల్ల నీరు వృథా కాకుండా ఉంటుంది. డ్రిప్పు ద్వారా మూడు రోజులకొకసారి నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. సూక్ష్మనీటి సేద్య పద్ధతుల ద్వారా డ్రిప్పు, స్ప్రింకర్ల ద్వారా ఇస్తే 15-20 శాతం నుండి 40 శాతం దిగుబడి పెరుగుతుంది. మొక్కలు పుష్పించే దశ, కాయ ఊరే దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలి.

కొమ్మ, కాయతొలిచే పురుగు : ఈ పురుగు ఉధృతి పంట పుష్పించే దశ నుంచి మొదలై పంట పూర్తికాలం వరకూ ఉంటుంది. తొలిదశలో పురుగు కొమ్మలపై, కాయలపై ఉన్న పత్రహరితాన్ని గీకి తింటుంది. పుష్పించే దశలో కొమ్మలోకి పోవడం వల్ల కొమ్మ ఎండిపోతుంది. తర్వాత దశలో కాయలోకి చొచ్చుకొనిపోయి కాయలను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతదశలో ఒకసారి, 20 రోజులకు మరొకసారి మోనోక్రొటోఫాస్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ఇండ్సాకార్బ్‌ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పంటకోత-నిల్వ : ఆముదం పంట అంతా ఒకేసారి కోతకు రాదు. 3-4 సార్లు కోయాల్సి వస్తుంది. విత్తిన 90-95 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది. గెలలో 80 శాతం వరకూ కాయలు ముదిరి, ఆకుపచ్చ రంగు నుంచి లేత పసుపు రంగుకు మారినపుడు ఆ గెలను కోసుకోవాలి. కాయలను ఎండబెట్టి వేరుశనగ నూర్చి, యంత్రంతోనే జల్లెడ మార్చుకొని వాడుకోవచ్చు. గింజల్లో 9-10 శాతం తేమ ఉండేటట్లు బాగా ఎండబెట్టి, గోనె సంచుల్లో నిల్వ ఉంచుకోవాలి.

విత్తనోత్పత్తి : పూత దశలో గెల కింది భాగంలో ఒకటి లేదా రెండు గుత్తుల మగ పుష్పాలు మాత్రమే ఉన్న మొక్కలను ఉంచి, మిగిలినవి తీసివేయాలి. పూత దశ తర్వాత కాయల లక్షణాలు ఆధారంగా భిన్నంగా ఉన్న మొక్కల్ని పీకేయాలి.

ఆడ, మగ మొక్కల ద్వారా వచ్చే గెలలను వేరువేరుగా కోయాలి. ఆడ మొక్కల నుంచి వచ్చే విత్తనాలను హైబ్రీడ్‌ విత్తనంగా వాడుకోవాలి. మేలైన యాజమాన్యంతో ఎకరానికి 4 నుండి 5 క్వింటాళ్ళ హైబ్రీడ్‌ విత్తనం తయారుచేయవచ్చు.

మరిన్ని వివరాలకు మీ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ లేదా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ను సంప్రదించండి. 

రైతులు మరిన్ని సలహాల కోసం ఈ ఉచిత నంబరుకూ కాల్‌ చేయవచ్చు-1800 425 0430

డా. కె. రాజారెడ్డి,

విస్తరణ సంచాలకులు,

ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ

విశ్వవిద్యాలయం, గుంటూరు – 522 034.

 

Credits : www.prajasakti.com

కాండం తొలిచే పురుగుతో భద్రం

వివిధ పంటలకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతాంగానికి ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ దిగువ సూచనలు చేస్తున్నారు.
వరి : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. ఈ పరిస్థితుల్లో వరి పంటకు కాండం తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది కాబట్టి ఆ పురుగు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నాటిన 15-20 రోజుల లోపు కార్బోఫ్యూరాన్‌ 3-జి గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. వరిలో జింకు ధాతు లోపం గమనించినట్లయితే రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి అయిదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో రెండు మూడుసార్లు పిచికారీ చేయాలి.
 
మొక్కజొన్న : మొక్కజొన్నలో బెట్ట వాతావరణ పరిస్థితులలో పేనుబంక ఆశించే అవకాశాలున్నాయి. దీని నివారణకు రెండు మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమిటాన్‌ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్‌ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Credits : andhrajyothi

పక్షులు.. పంటలకు ఆప్తమిత్రులు!

Protect Crops From Birds Prof Dr Vasudeva Rao ...

పత్తి, కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు తదితర పంటలనాశించే శనగపచ్చ పురుగును తినే పక్షి జాతులున్నాయి..

పంటలను పాడు చేసే పక్షి జాతులు 63.. మేలు చేసే పక్షి జాతులు 420!

పంటలకు మేలు/హాని చేసే పక్షులపై పీజేటీఎస్‌ఏయూలో విస్తృత పరిశోధనలు

అడవి పందులు, కోతుల నుంచి పంటలను కాపాడుకునే మార్గాలపైనా అన్వేషణ

మిత్ర పక్షుల ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతు సురేశ్‌రెడ్డి

పక్షులు..!  పంటలకు మిత్రులా? శత్రువులా??

పక్షుల పేరు వినగానే పంటలకు కీడు చేస్తాయన్న భావనే సాధారణంగా చాలా మంది రైతుల మదిలో మెదులుతుంది…  కానీ, నిజానికి పంటలను కనిపెట్టుకొని ఉంటూ పురుగులను ఎప్పటికప్పుడు ఏరుకు తింటూ ఎంతో మేలు చేసే పక్షి జాతులు వందలాదిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటూ ఉంటే..  ఏదో చెబుతుంటారు.. కానీ, ఈ కలికాలంలో ఇవన్నీ రైతులు ఆధారపడదగినవి కాదేమోనని అనిపిస్తుంటుంది. అయితే, యువరైతు సురేశ్‌రెడ్డి మాత్రం మిత్ర పక్షుల వల్ల పంటలకు ఎంతో మేలు జరుగుతున్న మాట ముమ్మాటికీ నిజమేనని అనుభవపూర్వకంగా చెబుతున్నారు!

తన పొలంలో కొంగలు, కాకులు, నీటికోళ్లు, బండారి గాళ్లు (గిజిగాళ్లు) వంటి మిత్ర పక్షులు పురుగులను ఏరుకు తింటూ పంటలను చాలా వరకు చీడపీడల నుంచి కాపాడుతున్నాయని సంతోషంగా చెబుతున్నారు. మిత్ర పక్షులు మన పొలాలకు రావాలంటే.. పొలం గట్ల మీద, పరిసరాల్లో చెట్లను పెరగనివ్వాలని.. వాటిపైనే మిత్రపక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకొని మన పంటలకు అనుక్షణం కాపలా కాస్తున్నాయని కృతజ్ఞతాపూర్వకంగా చెబుతున్నారు.

గత 20 ఏళ్లుగా తాము ఒక్క చెట్టునూ నరకలేదని సురేశ్‌రెడ్డి గర్వంగా చెబుతున్నారు. పక్షులు, జంతువుల ద్వారా పంటలకు కలిగే లాభనష్టాలపై, పంట నష్టాలను అధిగమించే ఉపాయాలపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ వైద్యుల వాసుదేవరావు సారధ్యంలో దీర్ఘకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి.   డా.వాసుదేవరావు సూచనలు, సలహాలను సురేశ్‌రెడ్డి గత ఐదారేళ్లుగా శ్రద్ధగా పాటిస్తూ.. పంటల సాగులో మిత్ర పక్షుల సహాయంతో చీడపీడలను సులువుగా జయిస్తుండటం విశేషం.

మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి పంటపై అతి ప్రమాదకరమైన పురుగుల మందులను చల్లుతూ ఇటీవల 18 మంది రైతులు, రైతు కూలీలు చనిపోగా 400 మంది ఆసుపత్రులపాలయ్యారు. ఈ నేపథ్యంలో చీడపీడల బారి నుంచి పంటలను కాపాడటంలో పురుగుమందులే కాదు మిత్ర పక్షులు కూడా ఎంత సమర్థవంతంగా ఉపకరిస్తాయో తెలియజెప్పే శాస్త్రీయ పరిశోధనలు, అనుభవాలపై ప్రత్యేక సమగ్ర కథనం ‘సాక్షి సాగుబడి’ పాఠకుల కోసం..

పొలాల్లో పురుగులను పక్షులతో ఏరించవచ్చు!
► పొలాల్లో పురుగులను ఏరుకు తిని పంటలకు మేలు చేసే పక్షులు 420 జాతులున్నాయి.
► పత్తి తదితర పంటల్లో శనగపచ్చ పురుగులు, పొగాకు లద్దెపురుగులను పక్షులు ఇష్టంగా తింటాయి
► మిత్ర పక్షులను సంరక్షిస్తే పురుగుమందుల అవసరాన్ని మూడొంతులు తగ్గించవచ్చు
► ‘సాగుబడి’ ఇంటర్వ్యూలో ముఖ్య శాస్త్రవేత్త డా. వాసుదేవరావు

మన దేశంలో 1300 పక్షి జాతులుంటే.. 483 జాతుల పక్షులకు వ్యవసాయ పంటలతో సంబంధం ఉంది. 420 జాతుల పక్షులు రైతు నేస్తాలు. పొలాల్లోని పురుగులు మాత్రం తిని బతుకుతూ రైతులకు ఇవి ఎనలేని మేలు చేస్తున్నాయి. పండ్లు, గింజలు తినే 63 జాతుల పక్షులు పంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఈ పక్షులు, అడవి పందులు, కోతులు తదితర జంతువుల (ఎలుకలు మినహా) వల్ల దేశవ్యాప్తంగా పంటలకు తీరని నష్టం జరుగుతున్నది. అడవులు, పొలాల దగ్గర చెట్ల సంఖ్య తగ్గిపోతున్నకొద్దీ వీటి బెడద పెరుగుతున్నది. వీటిని చంపడానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం అంగీకరించదు.

కాబట్టి, పంటలను వీటి నుంచి కాపాడుకునే ఉపాయాలపై పరిశోధనలు చేయడానికి దేశవ్యాప్తంగా 17 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ‘అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం’ ఏర్పాటైంది. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న విభాగానికి ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు అధిపతిగా పనిచేస్తున్నారు. ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పంటలకు హాని చేసే పక్షులను, అడవి పందులను పారదోలడానికి ఆయన కనిపెట్టిన యంత్రానికి పేటెంట్‌ రావటం విశేషం. ఆయన సారథ్యంలో పక్షులపై 17 ఏళ్లుగా, అడవి పందులపై ఐదేళ్లుగా, రెండేళ్లుగా కోతులపై జరుగుతున్న పరిశోధనలు రైతుల శ్రేయస్సుకు దోహదపడుతున్నాయి. ‘సాక్షి సాగుబడి’కి డా. వాసుదేవరావు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు..

పక్షులు, జంతువులకు క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటాయి. ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే సంపాదించుకొని ఎంత అవసరమో అంతే తింటాయి. పక్షుల్లో కొన్ని జాతులు పురుగులు మాత్రమే తింటాయి. మరికొన్ని జాతులు గింజలను తింటాయి. రామచిలుకలు స్వతహాగా పండ్లు తింటాయి. అడవుల నరికివేతతో పాటు రోడ్ల విస్తరణ వల్ల పండ్ల చెట్లు తగ్గిపోవటంతో రామచిలుకలు గింజలు తింటున్నాయి. శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను పురుగుమందుల పిచికారీ ద్వారానే కాదు మిత్ర పక్షుల ద్వారా కూడా అరికట్టవచ్చు.

పత్తి, వేరుశనగ, శనగ, కంది, మినుము, పొద్దుతిరుగుడు తదితర పంటలకు నష్టం చేస్తుంది. పొలాల్లో శనగపచ్చపురుగు, పొగాకు లద్దె పురుగులను ఇష్టంగా తినే పక్షులు మన దేశంలో 420 రకాల జాతులు ఉన్నాయి. వేరుశనగ పొలంలో ఒక కొంగ 20 నిమిషాల్లో సుమారు 50 పురుగులను తింటుంది. శనగ పంటలో శనగపచ్చ పురుగును సముద్ర కాకులు ఏరుకు తిని పురుగుల ఉధృతిని 73% వరకు తగ్గిస్తాయి. పంటల సాళ్ల మధ్య అడుగున్నర దూరం ఉన్న పొలాల్లో కన్నా.. 2 అడుగుల దూరం ఉన్న పొలాల్లో పక్షులు స్వేచ్ఛగా తిరుగుతూ పురుగులను ఏరుకు తింటాయి.  మిత్ర పక్షుల్లో తెల్లకొంగలు చాలా ముఖ్యమైనవి. వర్షాలు పడి పొలాలు దున్నుతున్నప్పుడు బయటపడే వేరుపురుగులను, లార్వా దశలో ఉన్న పురుగులను 73% వరకు కొంగలు తినేస్తాయి. మే,జూన్‌ నెలల్లో చెట్లపై స్థావరాలను ఏర్పాటు చేసుకొని దుక్కుల సమయంలో సంతానోత్పత్తి చేస్తాయి.

తెల్ల కొంగలు.. వర్షాల రాకను ముందే పసిగట్టగలవు!
ఒకటి, రెండు నెలలు ముందుగానే వర్షాల రాకను తెల్లకొంగలు గ్రహించి, తదనుగుణంగా గుడ్లు పెట్టడానికి సమాయత్తమవుతాయి. వర్షాలు ఆలస్యమౌతాయనుకుంటే.. సంతానోత్పత్తి షెడ్యూల్‌ను ఆ మేరకు వాయిదా వేసుకుంటాయి. పిల్లలను పొదిగే దశలో తెల్లకొంగల మెడ భాగం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని బట్టి వర్షం రాకను తెలుసుకోవచ్చు. వర్ష  సూచిక జాతిగా కొంగలు గుర్తింపు పొందాయి. పొలాలు దున్నుతున్నప్పుడు, పశువులు నడుస్తున్నప్పుడు బయటపడే వేరుపురుగులను కొంగలు తింటాయి.ఒక్కో పిల్లకు రోజుకు 16 గ్రాముల చొప్పున.. 3 పిల్లలకు కలిపి 45 గ్రాముల వేరుపురుగులను ఆహారంగా అందిస్తాయి. ఒక చెట్టుంటే.. వందలాది కొంగల గూళ్లుంటాయి. దీన్నిబట్టి పంటలకు ఎంత మేలు చేస్తున్నాయో గుర్తించవచ్చు. వీటి ఆహారంలో 60% పురుగులు, 10% కప్పలు, 5% చిన్నపాములు, చేపలు ఉంటాయి. తెల్లకొంగలు పొలాల్లో చెట్ల మీదకన్నా మనుషుల ఇళ్లకు దగ్గర్లోని చెట్లపైనే ఎక్కువ గూళ్లు పెట్టుకుంటాయి. మనుషులకు దగ్గర్లో ఉంటే శత్రువుల నుంచి రక్షణ దొరుకుతుందని భావిస్తాయి.

కానీ, కొంగలు రెట్టలు వేస్తున్నాయని, నీసు వాసన వస్తున్నదని మనం మూర్ఖంగా చెట్లు కొట్టేస్తున్నాం. పంటలపై చీడపీడలు పెరగడానికి ఇదొక ముఖ్య కారణం. పొలాల దగ్గర్లో, గట్ల మీద పూలు, పండ్ల చెట్లను పెంచితే వాటిపై స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ పక్షులు పురుగులను తింటూ పంటలను కాపాడతాయి. కానీ, మన పొలాల్లో, గట్లపై చెట్లను 95% వరకు నరికేశాం. చెట్లుంటే పక్షులు వాలి పెంటికలు వేస్తాయి. వర్షం పడినప్పుడు నీసు వాసన వస్తుంది.ఇది తెలియక మనుషులు ఇళ్ల దగ్గర, ఊళ్లో, పొలాల గట్ల మీద ఉన్న చెట్లను నరికేస్తున్నారు. తెల్ల కొంగలు ఊళ్లో చెట్ల మీదే ఎక్కువగా గూళ్లు పెట్టి.. కిలోమీటర్ల దూరంలోని పొలాలకు వెళ్లి పురుగులను తింటాయి. పక్షుల విసర్జితాలు భూసారాన్ని సహజసిద్ధంగా పెంపొందించడానికి దోహదపడతాయి. పంటల్లో పురుగులు ఏరుకొని తినే మిత్ర పక్షులను ఆహ్వానించాలనుకుంటే పొలాల గట్లపైన, పరిసరాల్లో చెట్లు పెంచాలి. పంట పొలాల మధ్య ‘టి’ ఆకారంలో పంగల కర్రలు లేదా పక్షి స్థావరాలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలి. పంట ఎంత ఎత్తుకు ఎదుగుతుందో దానికన్నా అడుగు ఎత్తున ఈ పంగల కర్రలు ఉండాలి.  పురుగులు పంట పూత దశలో వస్తాయి. అప్పుడు పంగల కర్రలను ఏర్పాటు చేయాలి. ఎన్‌.పి.వి. (న్యూక్లియో పాలీ హైడ్రో ద్రావణం) ద్రావణాన్ని హెక్టారుకు 250 ఎల్‌.ఈ. మోతాదులో పురుగు వచ్చిన తొలిదశ(మొక్కకు 2,3 పురుగులు కనిపించినప్పుడు)లో పిచికారీ చేయాలి. ఈ రెండు పనులూ చేస్తే పురుగుమందుల వాడకాన్ని 75% తగ్గించుకోవచ్చు.

శత్రు పక్షుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలు!
పొలాల్లో పురుగులు ఏరుకు తిని బతికే పక్షుల వల్ల పంటలకు మేలు జరుగుతుండగా.. పంటలపై దాడి చేసి కంకుల్లో గింజలను, కాయలను తినేసే 63 రకాల పక్షుల వల్ల రైతుకు నష్టం జరుగుతున్నది. పూల నుంచి మకరందాన్ని, పండ్లను, గింజలను తిని బతికే పక్షులు ఇవి. వీటి నుంచి పంటలను కాపాడుకోవడానికి అనేక ఉపాయాలను
డా. వాసుదేవరావు రైతులకు సూచిస్తున్నారు.

► మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, చిరుధాన్య పంటలకు పక్షుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది. వీటిని ప్రధాన పంటలుగా ఎకరంలో సాగు చేస్తే పక్షుల వల్ల దిగుబడి నష్టం 80–90 శాతం ఉంటుంది. అయితే, ఒకే చోట కనీసం 20 ఎకరాల్లో ఈ పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తే నష్టం 5% కన్నా తక్కువగానే ఉంటుంది. ఈ పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులు అనేక ఉపాయాల ద్వారా పంటను రక్షించుకునే తక్షణ, దీర్ఘకాలిక మార్గాలున్నాయి.

► రామచిలుకలు, గోరింకలు, కాకులు, జీలువాయిలు, పిచుకలు, గిజిగాళ్లు.. తదితర జాతుల పక్షుల వల్ల పంటలకు నష్టం జరుగుతున్నది. పూల చెట్లు, పండ్ల చెట్లను నరికేయడం వల్ల ఈ పక్షులు పంటల మీదకు వస్తున్నాయి.

► ఒక ప్రాంతంలో 250–300 పక్షులు ఉంటాయి. 15–20 కిలోమీటర్ల పరిధిలో పంటలపైనే ఇవి వాలతాయి. ఆ పరిధిలోకి ఇతర పక్షులు రావు. ఆహారం దొరక్కపోతే వెళ్లిపోతాయి. సంతతి బాగా పెరిగినప్పుడు దూరంగా వలస వెళ్లిపోతాయి.

► పంటలను నష్టపరిచే జాతుల పక్షులు ఎక్కువగా ఏయే జాతుల చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయో గత 3,4 ఏళ్లుగా డా. వాసుదేవరావు సారధ్యంలో అధ్యయనం జరిగింది. 12 పూలజాతి చెట్లు, 11 పండ్ల జాతి చెట్లపై స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీటిలో వీలైన కొన్ని జాతుల చెట్లను పొలం గట్లపై నాటితే.. పంటలను నష్టపరిచే పక్షుల దష్టిని మళ్లించి పంటలను కాపాడుకోవచ్చు.

► పొలాలకు దగ్గర్లో హెక్టారుకు పూల జాతి చెట్లు 4, పండ్ల జాతి చెట్లు 4 పెంచితే పక్షులు వీటిపై ఆధారపడి బతుకుతాయి. పంటల జోలికి రావు.

► పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పూల జాతి చెట్లు:
కాడమల్లి, రేల, అడవి బూరుగ, చెట్టు తంగేడు, నిద్రగన్నేరు, మోదుగ, అడవి గానుగ, దేవకాంచనం, కారక, ఆకుపాల, ఇప్ప, సీమగానుగ…
► పంటలను నష్టపరిచే పక్షులు ఇష్టపడే పండ్ల జాతి చెట్లు:
నేరేడు, రావి, మర్రి, చీమచింత, చింత, ఈత, పరిగి, రేగు, చెక్కర చెట్టు, నక్కెర, మేడి…

పేపర్‌ ప్లేట్ల పద్ధతి
► పొద్దు తిరుగుడు గింజలు పాలుపోసుకునే దశలో అల్యూమినియం ఫాయిల్‌ పూతపూసిన పేపర్‌ పేట్లను పొద్దుతిరుగుడు పువ్వుల అడుగున అమర్చితే రామచిలుకల దాడి నుంచి 69% పంటను రక్షించుకోవచ్చు.

మొక్కజొన్నకు ఆకుచుట్టు రక్షణ!
► మొక్కజొన్న పంట పాలు పోసుకునే దశలో కంకి చుట్టూ చుట్టి పక్షుల దష్టిని మరల్చవచ్చు.
► పొలం గట్ల నుంచి 3 లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దష్టిని మరల్చి పంటలను రక్షించుకోవచ్చు.
► తక్కువ విస్తీర్ణంలో పంట వేసిన రైతులకు ఇది అనువైన పద్ధతి.

రక్షక పంట పద్ధతి
► రామచిలుకలు సాధారణంగా మొక్కజొన్న పంటకు గట్టు పక్కన మొదటి వరుసపై దాడి చేస్తాయి.
► జొన్న లేదా మొక్కజొన్న మొక్కలను గట్ల పక్కన వరుసలో రెట్టింపు ఒత్తుగా వేయడం (స్క్రీన్‌ క్రాప్‌) ద్వారా పక్షులను పంట లోపలికి చొరబడకుండా అడ్డుకోవచ్చు

కోడి గుడ్ల ద్రావణం పిచికారీ
► పొద్దుతిరుగుడు పంటలో గింజ పాలుపోసుకునే దశలో 20 మి.లీ. కోడిగుడ్ల ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పూలపై పిచికారీ చేయాలి. పక్షుల వల్ల కలిగే నష్టాన్ని 82% వరకు తగ్గించుకోవచ్చని రుజువైంది.
► విత్తనోత్పత్తి క్షేత్రాలలో నైలాన్‌ వలలను పంటపైన కప్పటం ద్వారా పక్షుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు.

నెమళ్ల నుంచి పంటలను కాపాడుకునేదిలా..
► పొలంలో వేసిన విత్తనాలను నెమళ్లు తినేస్తుంటాయి. ఒక వైపు ఎరుపు, మరోవైపు తెలుపు రంగులో ఉండే రిబ్బన్లను విత్తనాలు వేసిన పొలంలో అడుగు ఎత్తులో కడితే విత్తనాలను నెమళ్ల నుంచి కాపాడుకోవచ్చు. మొలక వచ్చే వరకు 10 రోజులు ఉంచి రిబ్బన్లను తీసేయవచ్చు.
► పంట పొలాల్లోకి నెమళ్లు రాకుండా పొలం చుట్టూ 3 నిలువు వరుసలుగా కొబ్బరి తాళ్లతో కంచె మాదిరిగా కట్టాలి. పై తాడుకు కింది తాడుకు మధ్య అడుగు దూరం ఉండాలి. దాని నుంచి నెమలి లోపలికి వెళ్లలేదు.

వేప గింజల ద్రావణం పిచికారీ పద్ధతి
► వేప గింజల ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా పంటలను పక్షులు తినకుండా కాపాడుకోవచ్చు.

► లీటరు నీటికి 200 మి. లీ. వేప గింజల ద్రావణాన్ని కలిపి పంటలు గింజ పాలుపోసుకునే దశలో పిచికారీ చేయాలి. పక్షులు వేప గింజల ద్రావణం రుచి సహించక వెళ్లిపోతాయి.

► వేప గింజల ద్రావణం లేక పొగాకు కషాయాన్ని లీటరు నీటికి 10 మి.లీ. కలిపి పిచికారీ చేసి పక్షుల బెడదను నివారించుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, సజ్జ పంటల్లో ఇది బాగా పనిచేసింది.
(అడవి పందులు, కోతుల నుంచి పంటలను రక్షించుకునే ఉపాయాలపై కథనం వచ్చే వారం ‘సాగుబడి’ పేజీ చూడండి)

పక్షులు నడిచిన పొలాల్లో పురుగులు మిగలవు!
► మా పొలాల్లో వందల చెట్లున్నాయి..20 ఏళ్లలో ఒక్క చెట్టూ కొట్టలేదు
►  పంటలకు పురుగుమందుల అవసరం పెద్దగా లేదు
► ‘సాక్షి సాగుబడి’తో ఆదర్శ రైతు సురేశ్‌రెడ్డి
 పొలాల గట్లపైన, పరిసరాల్లో అనేక జాతుల చెట్లను, వాటిపైన గూళ్లు పెట్టుకున్న మిత్ర పక్షులను సంరక్షించుకుంటూ సమీకృత వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు చింతపల్లి సురేశ్‌ రెడ్డి (39). ఆయన స్వగ్రామం గడ్డమల్లాయిగూడెం. ఆ ఊరు హైదరాబాద్‌కు దగ్గర్లో రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంది. ఐదారు బర్రెలున్నాయి. ఒకటిన్నర ఎకరాల్లో వరి, ఎనిమిదెకరాల్లో రాగులు, సజ్జలు, ఉలవలు, కందులు వంటి ఆహార పంటలనే వేస్తున్నారు. వేసవిలో ఆకుకూరలు సాగు చేస్తారు. అధిక పెట్టుబడులు, అనుక్షణం టెన్షన్‌ పడటం ఎందుకని పత్తి జోలికి వెళ్లటం లేదన్నారు. వరి పొలం గట్ల మీద, చెల్క మధ్యలో కూడా చెట్లను పెరగనివ్వటం సురేశ్‌రెడ్డి ప్రత్యేకత. వంద వరకు వేపచెట్లు, 50 వరకు నల్లతుమ్మ, ఊడుగు తదితర జాతుల చెట్లు ఆయన పొలాల్లో ఉన్నాయి. ఇవన్నీ పడి మొలిచినవేనని అంటూ.. పనిగట్టుకొని మొక్కలు నాటక్కర లేదని, ఉన్న వాటిని నరక్కుండా ఉంటే చాలంటారాయన. గత 20 ఏళ్లలో ఒక్క చెట్టునూ తమ పొలాల్లో కొట్టలేదని గర్వంగా చెబుతున్నారు. గట్ల మీద చెట్లుంటే  పంటకు ఇబ్బందేమీ లేదని, వేసవిలో నీడలో పెరిగే కొత్తిమీర వంటి పంటలకు చెట్ల నీడ ఉపయోగపడుతుందంటున్నారు. చెట్లు ఉండటం వల్ల తమ పొలాల్లోకి అనేక రకాల మిత్ర పక్షులు వచ్చి పురుగులను తింటూ పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయంటున్నారు సురేశ్‌రెడ్డి. గత ఐదారేళ్లుగా డా. వాసుదేవరావు సూచనలు పాటిస్తూ మిత్ర పక్షుల సేవలను ఆయన జాగ్రత్తగా గమనిస్తున్నారు.
పురుగుమందుల అవసరం బాగా తగ్గింది..
సురేశ్‌రెడ్డి ఇంకా ఇలా చెబుతున్నారు.. ‘‘దుక్కి చేస్తున్నప్పుడు తెల్లకొంగలు, కాకులు వేరు పురుగులను, నిద్రావస్థలో ఉన్న పురుగులను తింటాయి. శ్రీవరి నాటిన తర్వాత సాళ్ల మధ్యలో కొంగలు తిరుగుతూ తెల్ల కంకికి కారణమయ్యే పురుగులను ఏరుకు తింటాయి. నీరుకోళ్లు వరి పొలంలో పురుగులను తింటూ కనిపిస్తాయి. పక్షులను పొలంలో నుంచి వెళ్లగొట్టను. వాటి పని వాటిని చేయనిస్తాను. కొందరు రైతులు మొక్కలను తొక్కుతాయేమోననుకొని వీటిని పారదోలుతుంటారు. కానీ, నీరుకోడి నడిచిన వరి పొలానికి కాండం తొలిచే పురుగు సమస్య అసలు రానే రాదు. చిరుధాన్య పంటలను ఇష్టపడే బండారి గాళ్లు (గిజిగాళ్లు) పక్షులు గడ్డిపోచలను ఏరి చెట్లకు అందమైన గూళ్లను నిర్మించుకొని స్థిరనివాసం ఉంటున్నాయి. పురుగులను తింటాయి. కొంత మేరకు చిరుధాన్యాలను తింటాయి. మనకన్నా ఎక్కువగా పంటను కనిపెట్టుకొని ఉంటాయి. పొలంలో పాము కనిపిస్తే ‘వచ్చే.. వచ్చే..’ అనే విధంగా చిత్రమైన శబ్దాలు చేస్తూ దూరంగా వెళ్లిపోతాయి. అక్కడ ఏమో ఉందని గ్రహించి మేమూ జాగ్రత్తపడుతుంటాం. మిత్ర పక్షులు పురుగులను తినటం వల్ల పురుగుమందుల అవసరం బాగా తగ్గింది. వరి, వంగ, బెండ వంటి పంటల్లో ఒకటి, రెండు సార్లు పురుగుమందులు పిచికారీ చేస్తే సరిపోతున్నది. చెట్లుంటేనే పురుగులను తినే పక్షులు మన దగ్గర్లో ఉంటాయి. వేప, నల్లతుమ్మ చెట్లు బాగా పెరిగాయి కాబట్టి వాటి ఆకులను మేకలు, గొర్రెల మేపునకు ఇస్తున్నాం. ఏటా రూ. 10 వేల అదనపు ఆదాయం కూడా వస్తున్నది..’’

ముందుగా రికార్డు చేసిన ఆర్తనాదాలను వినిపించడం ద్వారా పక్షులను భయపెట్టి పారదోలటం ఒక పరిష్కారం..
రిబ్బన్లు కడితే పంటలు సేఫ్‌!
► రిబ్బన్‌ పద్ధతి ద్వారా వివిధ పంటలను పక్షుల బెడద నుంచి కాపాడుకోవచ్చు.
► పంటకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కర్రలను ఉత్తర – దక్షిణ దిశలలో నాటాలి.
► ఒక పక్క ఎరుపు రంగు, మరో పక్క తెలుపు రంగులతో అర అంగులం వెడల్పు, 30 అడుగుల పొడవు గల రిబ్బన్‌ను 3 లేదా 4 మెలికలు తిప్పి.. కర్రలను 10 మీటర్ల దూరంలో నాటి కట్టాలి.
► పక్షుల ఉధృతి ఎక్కువగా ఉంటే కర్రల మధ్య దూరం 5 మీటర్లకు తగ్గించాలి.
► రిబ్బన్‌పైన ఎండ పడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ.. పంట ఏ దశలో ఉందో పక్షుల కంట పడకుండా ఈ రిబ్బన్‌ చేస్తుంది.
► ఈ పద్ధతిలో అన్ని రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, పండ్ల తోటలను పక్షుల బారి నుంచి కాపాడుకోవచ్చు.

Credits : https://www.sakshi.com/news/family/protect-crops-birds-prof-dr-vasudeva-rao-944310

అడవి పందులు, కోతుల పీడ విరగడయ్యేదెలా?

Wild pigs and monkeys to get sick?

అడవి పందులు, కోతుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పంటలకు తీవ్ర నష్టం

డా. వాసుదేవరావు సారథ్యంలో ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విస్తృత అధ్యయనం

అడవి పందులను పారదోలే ‘ఆర్తనాదాల యంత్రం’.. కోతులను బెదరగొట్టే తుపాకీకి రూపకల్పన

పంటల రక్షణకు మరికొన్ని ఉపాయాలను రూపొందించిన శాస్త్రవేత్తలు

అడవి పందులు, కోతుల సంఖ్య, పంట నష్టంపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించడం అవసరమంటున్న శాస్త్రవేత్తలు

అడవిలోని పందులు, కోతుల వంటి జంతువులకు ఆహార కొరత ఏర్పడితే ఏమవుతుంది? అవి దగ్గర్లోని పంట పొలాలపై వచ్చి పడుతూ ఉంటాయి. అడవి బలహీనమవుతున్న కొద్దీ పంటల మీద వీటి దాడి తీవ్రమవుతూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో  రైతులకు అడవి పందులు, కోతుల బెడద గత ఐదారేళ్ల నుంచి పెను సమస్యగా పరిణమించింది. వీటిని పారదోలి పంటలను కాపాడుకునే పద్ధతులపై ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం గత కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తున్నది. విభాగం అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. వైద్యుల వాసుదేవరావు సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం అడవి పందులు, కోతులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలేందుకు అనేక పద్ధతులను రూపొందించింది. ఇవి రైతులకు ఊరటనిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెంచుకుంటున్న అడవి పందులు, కోతులను నిర్మూలిస్తే తప్ప తమ కష్టాలు తీరవని కొందరు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటి కాల్చివేత నేరం.

కిం కర్తవ్యం?!
అడవి పందులు, కోతుల సంఖ్య ఎంత? వీటి వల్ల ఏయే పంటల్లో జరుగుతున్న నష్టం ఎంత? స్పష్టంగా తెలియదు! గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకావడం లేదన్నది ఒక వాదన. సమస్య తీవ్రతపై క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించినప్పుడే వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొనే మరింత సమర్థవంతమైన మార్గాలు వెదకడం సాధ్యమవుతుందని అఖిల భారత సకశేరుక చీడల(వెర్బట్రేట్‌ పెస్ట్‌) యాజమాన్య విభాగం అధిపతి డా. వాసుదేవరావు స్పష్టం చేస్తున్నారు.  పాలకులారా వింటున్నారా..?!

అడవి పందులు పంటల వాసనను  పసిగట్టి పొలాలపై దాడి చేస్తుంటాయి..
అడవి పల్చబడిపోవటం వల్ల వ్యవసాయం కూడా దెబ్బతింటున్నది. అడవిలో మానులు నరికివేతకు గురవడంతో అడవి జంతువులు, పక్షులకు ఆహారం దొరకడం లేదు. దాంతో అవి ఆకలి తీర్చుకోవడానికి రైతుల పంట పొలాలపైకి దాడి చేస్తున్నాయి. ఇందువల్లనే అడవి పందులు, కోతుల వంటి జంతువుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రైతులకు జరుగుతున్న పంట నష్టం ఏటేటా పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. అయితే, ఈ సమస్యపై పాలకులు అంతగా దృష్టి పెట్టకపోవటంతో రైతులకు కష్టనష్టాలే మిగులుతున్నాయి.

∙మన దేశంతోపాటు బర్మా, అమెరికా, రష్యా తదితర దేశాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇతర దేశాల్లో వీటిని కాల్చి లేదా విషం పెట్టి చంపుతున్నారు. కానీ, మన దేశంలో వివిధ కారణాల వల్ల వన్యప్రాణి సంరక్షణకే అధికంగా మొగ్గు చూపుతున్నాం

► అడవి పందులు సామాన్యంగా వర్షాకాలం ముగిసిన తర్వాత పంట పొలాలపై ఎక్కువగా దాడి చేస్తుంటాయి. గడ్డి భూములు, అటవీ పరిసర ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలు, పంట పొలాల సమీపంలో రాత్రి వేళల్లో సంచరిస్తూ ఉంటాయి

► అనేక రకాల పంటలు, దుంపలు, మట్టిలోని వేరు పురుగులు, పాములు, చిన్న జంతువులను తింటాయి. కలుపు మొక్క తుంగ గడ్డలను ఇష్టపడతాయి

► పరిపక్వ దశలోని మొక్కజొన్నకు 23–47%, వేరుశనగకు 20–48%, చెరకుకు 18–36%, వరికి 11–30%, జొన్నకు 10–20% చొప్పున పంట దిగుబడి నష్టం కలిగిస్తాయి. కంది, పెసర, వరి, శనగ, కూరగాయ పంటలకు కూడా అడవి పందులు నష్టం చేస్తాయి

► ఘాటైన వాసనను వెదజల్లే పసుపు, అల్లం, వాము, ఆవాలు.. ముళ్లను కలిగి ఉండే వాక్కాయ, కుసుమ, ఆముదం పంటల జోలికి అడవి పందులు రావు

► పంటలకు నష్టం కలిగించడంతోపాటు వైరస్‌ సంబంధమైన జబ్బులను ఇతర జంతువుల్లో వ్యాపింప చేస్తాయి

► అడవి పందుల్లో వాసన పసిగట్టే గుణం ఎక్కువ. కాబట్టి, దూరం నుంచే ఎక్కడ ఏ పంట ఉందో గ్రహిస్తాయి. చూపు, వినికిడి శక్తి తక్కువ

► ఆహార సేకరణకు 15–35 వరకు కలసి గుంపులుగా సంచరిస్తాయి. ఆడ పందులు నాయకత్వం వహిస్తాయి

► అడవి పందులు వర్షాకాలంలో 4–12 పిల్లలను కంటాయి ∙అడవి నుంచి బయటకు వచ్చిన అడవి పందులు సర్కారు తుమ్మ చెట్లలో నివాసం ఏర్పాటు చేసుకొని.. రాత్రుళ్లు పంటల పైకి దాడి చేస్తున్నాయి.

ఆర్తనాదాల యంత్రంతో అడవి పందులకు చెక్‌
అడవి పందులను సమర్థవంతంగా పారదోలేందుకు శాస్త్రవేత్తలు అనేక పద్ధతులను రూపొందించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినది ‘ఆర్తనాదాల యంత్రం’(బయో అకౌస్టిక్స్‌). బెంగళూరుకు చెందిన గ్రుస్‌ ఎకోసైన్సెస్‌ సంస్థతో కలసి దీన్ని రూపొందించారు. గత మూడేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో 155 మంది రైతుల క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. రైతుల అనుభవాలు, సూచనలకు అనుగుణంగా దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచారు. ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున త్వరలో కంపెనీతో అవగాహన ఒప్పందం జరగబోతోంది.

పులి, అడవి పంది తదితర అటవీ జంతువులు ఆపదలో ఉన్నప్పుడు బిగ్గరగా అరిచే ఆర్తనాదాలను 33 నిమిషాలపాటు రికార్డు చేశారు. ప్రతి జంతువు ఆర్తనాదాలకు మధ్యలో కొద్ది నిమిషాలపాటు.. ఇవి నిజమైన ఆర్తనాదాలేనని భ్రమింపజేయటం కోసం.. విరామం ఇచ్చారు. ఆర్తనాదాల యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి లేదా మరేదైనా కర్రకు బిగించవచ్చు. విద్యుత్‌తో నడుస్తుంది. కరెంట్‌పోతే సౌరశక్తితో నడుస్తుంది. బ్యాటరీ 12–14 గంటలు పనిచేస్తుంది. జీఎస్‌ఎం సిమ్‌ టెక్నాలజీని వాడారు. రైతు పొలానికి వెళ్లకుండానే సెల్‌ ద్వారా ఆన్‌/ ఆఫ్‌ చేయొచ్చు. అరుపులు బాగా బిగ్గరగా (42–37 డెసిబుల్స్‌) 10–15 ఎకరాల వరకు వినిపిస్తాయి.

అడవి పందులను అరికట్టే జీవకంచెలు: మొక్కజొన్న, జొన్న పంటల చుట్టూ ఆముదం మొక్కలను 4 వరుసలు దగ్గర దగ్గరగా విత్తుకొని అడవి పందులు లోపలికి రాకుండా చూడవచ్చు. ఆముదం పంటపై ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. వేరుశనగ పొలానికి చుట్టూ కుసుమ పంటను 4 వరుసలు వత్తుగా విత్తుకోవాలి. పొలం చుట్టూతా దగ్గర దగ్గరగా వాక్కాయ చెట్లు పెంచటం ద్వారా పొలంలోపలికి అడవి పందులు రాకుండా అడ్డుకోవచ్చు. వాక్కాయ చెట్టుకు ఉండే ముళ్లు వీటిని అడ్డుకుంటాయి. ఈ పంటల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది.

ఇనుప ముళ్ల కంచెలు: చిన్న కమతాల్లో పంటలు పండించుకునే రైతులు ముళ్ల కంచెలు వేసుకోవడం ద్వారా అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. బార్బ్‌డ్‌ వైర్‌తో 3 వరుసలుగా పంట చుట్టూ కంచెగా నిర్మించాలి. 2 అడుగుల గుండ్రటి కంచెను పంట చుట్టూ వేయాలి. దీన్నే పోలీస్‌ కంచె అని కూడా అంటారు.

చైన్‌ లింక్‌ ఫెన్స్‌ను పొలం చుట్టూ వేసుకొని పంటను రక్షించుకోవచ్చు. భూమి లోపలికి 9 అంగుళాల మేరకు దీన్ని పాతాలి. లేకపోతే కంచె కింద మట్టిని తవ్వి.. కంత చేసుకొని పొలంలోకి పందులు వస్తాయి. హెచ్‌.డి.పి.ఇ. చేపల వలను పొలం చుట్టూ వేసుకోవచ్చు. 3 ఇంచుల కన్ను ఉండే వలను వాడాలి. 3 అడుగుల ఎత్తు, 2 అడుగుల వలను భూమి మీద పరచి.. మేకులు కొట్టాలి. ఈ వలలో అడవి పందుల గిట్టలు ఇరుక్కుంటాయి.

కందకాలు: పొలం చుట్టూ కందకాలు తవ్వటం ద్వారా అడవి పందులను అడ్డుకోవచ్చు. కందకం 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు ఉండాలి. పొలం చుట్టూతా ఒకటే కందకం తవ్వాలి. ఎక్కడా గట్టు వదలకూడదు. పొలం గట్టుకు అడుగు దూరంలో తవ్వాలి. పందులు దూకి రాలేవు. వాన నీటి సంరక్షణ జరుగుతుంది. పక్క పొలాల నుంచి పురుగులు కూడా మన పొలంలోకి రావు.

విషగుళికలు: పొలం చుట్టూ కర్రలు పాతి ఫోరేట్‌ గుళికలను గుడ్డ మూటల్లో వేలాడగట్టాలి. 200 గ్రా. గుళికలను కిలో ఇసుకలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 100 గ్రా. చొప్పున తీసుకొని చిన్న, చిన్న రంధ్రాలు పెట్టినగుడ్డలో మూట గట్టాలి. 3 – 5 మీటర్ల దూరంలో కర్రలు పాతి వాటికి వేలాడ గట్టాలి.ఈ గుళికల ఘాటు వాసన పందులు పంట వాసనను పసిగట్టకుండా గందరగోళపరుస్తాయి. కాబట్టి పొలంలోకి రావు.

కోడిగుడ్డు ద్రావణం పిచికారీ: పంట చుట్టూ అడుగు వెడల్పున నేలపై గడ్డిని తవ్వేసి.. కోడిగుడ్డు ద్రావణాన్ని పిచికారీ చేస్తే పొలంలోకి పందులు రావు. కుళ్లిన లేదా మామూలు కోడిగుడ్లను పగలగొట్టి ఒక పాత్రలో పోసుకోవాలి. 25 మి.లీ. కోడిగుడ్డు ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పొలం చుట్టూ పిచికారీ చేయాలి.

పంది కొవ్వు + గంధకం పూత: పొలం చుట్టూ 3 వరుసల నిలువు కంచె మాదిరిగా కొబ్బరి తాళ్లు కట్టాలి. పంది కొవ్వులో గంధకాన్ని 3:1 నిష్పత్తిలో కలిపి.. ఆ మిశ్రమాన్ని తాళ్లకు పూయాలి. పందులైనా ఇతర జంతువులైనా ఒక గుంపు ఉన్న చోటకు మరొక గుంపు రావు. పంది కొవ్వు–గంధకం వాసన తగలగానే ఇక్కడ వేరే గుంపు ఉందని భ్రమపడి పందులు వెళ్లిపోతాయి.

వెంట్రుకలు: మనుషులు క్షవరం చేయించుకున్నప్పుడు రాలే వెంట్రుకలు తీసుకువచ్చి.. పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పున వేయాలి. గడ్డిని చెక్కి శుభ్రం చేసిన నేలపై వెంట్రుకలు వేయాలి. అడవి పందులు ముట్టెతో వాసన చూసినప్పుడు ఈ వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి గుచ్చుకుంటాయి. దాంతో వెనుదిరిగి వెళ్లిపోతాయి.

కోతులకు తిండి పెట్టటం మానితే 30% పంట నష్టం తగ్గుతుంది!
తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు అడవి పందులతోపాటు కోతుల బెడద ఎక్కువగా ఉంది. వీటి సంతతి వేగంగా పెరుగుతుండటంతో పంట నష్టం ఏటేటా పెరుగుతున్నది. అడవుల్లో, రోడ్ల పక్కన వివిధ రకాల పండ్ల చెట్లను అభివృద్ధి పేరిట నరికివేస్తుండటం వల్ల కోతులు ఆహారం కోసం పంటల మీదకు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రజల్లో కొన్ని రకాల సెంటిమెంట్ల కారణంగా కోతులకు పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తినిపించడం కూడా కోతుల సంతతి తామరతంపరగా పెరిగి సమస్యాత్మకంగా తయారవుతున్నదన్నది నిపుణుల మాట. కోతులకు మనుషులు ఆహారం వేయటం మానేస్తే వీటి మూలంగా జరుగుతున్న పంట నష్టం 30% మేరకు తగ్గిపోతుందని గత రెండేళ్లుగా ఈ సమస్యపై అధ్యయనం చేస్తున్న ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యశాస్త్రవేత్త డా. వాసుదేవరావు చెప్పారు.

మన ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కోతులకు తోక పొట్టిగా, ముడ్డి ఎర్రగా ఉంటుంది. ఆగస్టు – అక్టోబర్‌ నెలల మధ్య ఇవి పిల్లలను పెడుతూ ఉంటాయి. ఆడ కోతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం వీటి సంతతి వేగంగా పెరగటానికి ప్రధాన కారణమవుతోంది. సాధారణంగా ఒక మగ కోతికి 2.8 ఆడ కోతుల చొప్పున ఉండాలి. కానీ, తాము నిర్వహించిన సర్వేలో ప్రతి మగ కోతికి 6.7 ఆడకోతులు ఉన్నాయని తేలినట్లు డా. వాసుదేవరావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

కోతులు తినని పంటలు: కోతుల బెడద బాగా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వాటికి నచ్చని పంటలను సాగు చేయటం మేలని డా. వాసుదేవరావు సూచిస్తున్నారు. పసుపు, అల్లం, కంద, చేమగడ్డ, బంతి, మిర్చి, ఆవాలు, సజ్జ వంటి పంటల జోలికి కోతులు రావని ఆయన తెలిపారు. ఇతర పంటలను సాగు చేసే రైతులు కోతులు తినని పంటలను సరిహద్దు రక్షక పంటలుగా వత్తుగా కొన్ని సాళ్లు వేసుకోవటం వల్ల ప్రయోజనం ఎంత వరకూ ఉంటుందన్న కోణంలో అధ్యయనం జరుగుతోంది.

రోడ్ల వెంట చెట్ల నరికివేతతో సమస్య తీవ్రం..: మన పూర్వీకులు రోడ్లకు ఇరువైపులా నేరేడు, చింత, మద్ది, రావి తదితర పండ్ల జాతులు, మోదుగ, బూరుగ వంటి మకరందాన్ని అందించే పూల చెట్లను ఎంతో ముందు చూపుతో నాటేవారు. ఆ చెట్లపై ఆధారపడి కోతులు ఆకలి తీర్చుకుంటుండేవి. అయితే, రోడ్ల విస్తరణలో భాగంగా మన ముందు తరాల వారు నాటిన పెద్ద చెట్లన్నిటినీ నరికేశాం. అదే విధంగా అడవిలో కూడా పెద్ద మాన్లు నరికివేతకు గురయ్యాయి. చిన్న చెట్లతో కూడిన అడవులే పల్చగా మిగిలాయి. దీంతో కోతులకు చెట్ల ద్వారా ఆహారం లభించక పంటల మీదే ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితి వచ్చిందని డా. వాసుదేవరావు అంటున్నారు.

హరితహారం, సామాజిక అడవుల పెంపకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతర పరాయి ప్రాంతపు వృక్ష జాతులకు బదులు సంప్రదాయక పండ్ల జాతుల మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన సూచిస్తున్నారు. వాణిజ్యదృష్టితో టేకు, యూకలిప్టస్‌ వంటి మొక్కలను నాటడం కన్నా పండ్లు, పూల జాతి చెట్లను ఎక్కువగా పెంచి, కోతులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి. ప్రణాళికలన్నీ మనుషుల ఆర్థిక అవసరాలు, సౌలభ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచిస్తున్నారని.. సకల జీవరాశి మనుగడను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ఆయన సూచన.

సోలార్‌ ఫెన్సింగ్‌: కోతులు, అడవి పందులు పంటను పాడు చేయకుండా పొలం చుట్టూ జీఏ వైరుతో సోలార్‌ ఫెన్సింగ్‌ వేసుకోవచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఉన్న పొలాలకు ఇది ఉపకరిస్తుంది. ఇది షాక్‌ కొడుతుంది, అయితే చనిపోయే అంత తీవ్రత ఉండదు. కాబట్టి, జంతువులు బెదిరి పారిపోతాయి. ఎకరానికి రూ. 15 వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్తనాదాల యంత్రాన్ని కూడా ఈ సోలార్‌ ఫెన్సింగ్‌కు అనుసంధానం చేసే యోచన ఉందని డా. వాసుదేవరావు తెలిపారు.

కోతులను, పక్షులను పారదోలే గన్‌: కోతులను, పక్షులను బెదరగొట్టి పారదోలటానికి నల్లని పెద్ద తుపాకీని డా. వాసుదేవరావు రూపొందించారు. అనేక పరీక్షల అనంతరం, ప్రయోగాత్మకంగా వాడి చూసిన రైతుల అనుభవాలను బట్టి దీన్ని మెరుగుపరుస్తున్నారు. కోతుల మీదకు ఈ తుపాకీతో పేపర్‌ బాల్స్‌ను ప్రయోగిస్తే.. దాని నుంచి పెద్ద శబ్దం వస్తుంది. బాల్స్‌ దెబ్బ తిన్న కోతులు మళ్లీ ఆ పొలం వైపు రావని చెబుతున్నారు. ప్రయోగాలు పూర్తయిన తర్వాత రైతులకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.

అడవి పందులు కోతుల లెక్కలు తీయాలి
అడవి పందులు, కోతులు తదితర అటవీ జంతువులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం మనుషులమే. కాబట్టి వాటి ఆవాస ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రత్యామ్నాయ ఆహార పంటలను పండిస్తూ వన్య జీవుల పరిరక్షణ కూడా ఒక బాధ్యతగా గుర్తించి నిర్వర్తించటం మన కర్తవ్యం. జంతువులను పంట పొలాల నుంచి దూరంగా పారదోలే పద్ధతులపై పరిశోధనలు చేపట్టాం. వన్య ప్రాణులకు ముప్పు కలిగించని పర్యావరణ హిత పద్ధతులను రూపొందిస్తున్నాం. వాటికి పునరావాస ప్రాంతాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా వివిధ వన్యజాతులు మనుగడ సాగించడానికి అనువైన పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా రైతులోకానికి కూడా మేలు జరుగుతుంది. అభివృద్ధి పేరిట వన్యజీవుల ఆవాసాలలోకి చొచ్చుకొని పోయిన మానవులు వన్య జీవుల ఉనికిని ప్రశ్నిస్తున్నారు. సమస్త జీవకోటికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కును కాలరాసే అధికారం మానవునికి నిక్కచ్చిగా లేదు. మానవజాతి ఇప్పటికైనా వన్యజీవుల ఆవాస ప్రాంతాలను ధ్వంసం చెయ్యకుండా.. వాటిని కాపాడే బాధ్యత తీసుకోవాలి.. అడవి పందులు, కోతులు ఎన్ని ఉన్నాయి? వీటి వల్ల పంటలకు జరుగుతున్న నష్టం ఎంత? వంటి విషయాలపై ఇప్పటి వరకు అధికారిక అంచనాలు అందుబాటులో లేవు. ప్రభుత్వాలు పూనికతో కచ్చితమైన గణాంకాలను సేకరిస్తే.. అడవి పందులు, కోతుల బారి నుంచి పంటలను పూర్తిగా కాపాడుకోవటం సాధ్యమవుతుంది. అడవిలో పులులు, చిరుత పులుల మాదిరిగా అడవి పందులు, కోతుల కచ్చితమైన గణాంకాల సేకరణ అసాధ్యమేమీ కాదు. గణాంకాలు సేకరిస్తే.. పంట నష్టాలను పూర్తిగా నివారించటం సాధ్యమవుతుంది.

 

ఆర్తనాదాల యంత్రం వరి పంటను కాపాడింది!
4 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు చేశాను. పంట వేసిన 30 రోజుల తర్వాత ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదం యంత్రాన్ని పొలంలో కరెంటు స్థంభానికి బిగించాను. అడవి జంతువుల ఆర్తనాదాలను వినిపించటం ద్వారా అడవి పందులు పంట జోలికి రాకుండా ఇది కాపాడింది. ఈ యంత్రం లేకపోతే ఎకరానికి కనీసం రూ. 5 వేల పంట నష్టం జరిగి ఉండేది.  పదేళ్ల నుంచి అడవి పందులతోపాటు కోతుల సమస్య కూడా బాగా పెరిగిపోయింది. మూసీ నదికి అటూ ఇటూ ఉన్న గ్రామాల్లో సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోవటానికి కూడా కోతుల వల్ల భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉప్పు చేపల వాసనకు కోతులు పరారీ!
మా ఇంటి పెరట్లో జామ, మామిడి, సీతాఫలం, నిమ్మ వంటి అనేక పండ్ల చెట్లున్నాయి. కాయలను కోతులు బతకనివ్వటం లేదు. ఐదారు ఉప్పు చేపలను గుడ్డలో మూటలు కట్టి నెల క్రితం 6 చోట్ల వేలాడదీశాను. కోతులు ఏయే మార్గాల ద్వారా వస్తున్నాయో అక్కడ కట్టాను. అప్పటి నుంచి కోతులు ఆప్రాంతానికి వచ్చినా మా చెట్ల మీదకు రాలేదు. ఉప్పు చేపల వాసనతో తమకు ముప్పు పొంచి ఉందని భీతిల్లి కోతులు వెళ్లిపోతున్నాయి. ఈ చేపలను వాసన తగ్గిపోయిన తర్వాత రెండు నెలలకోసారి మార్చాలి. వర్షాకాలంలో నెలకోసారి మార్చాలి… మా తోటకు అడవి పందుల బెడద ఉంది. పంది కొవ్వు+గంధకం మిశ్రమంలో తాడును ముంచి.. ఆ తాళ్లను వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న ముళ్ల కంచెకు కట్టాం. తల వెంట్రుకలను సేకరించి పొలం చుట్టూ వేసిన తర్వాత అడవి పందులు రావటం లేదు.

అడవి పందులు పంటలను బతకనివ్వటం లేదు..
ఎమ్మే, బీఈడీ చదివా. ఉద్యోగం రాలేదు. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఐదారేళ్ల నుంచి అడవి పందుల సమస్య పెరుగుతూ వచ్చింది. అడవిలో తినటానికి గడ్డల్లేక పొలాల మీదకు వస్తున్నాయి. ఏ పంట వేసినా కష్టంగానే ఉంది. మొదట్లో మొక్కజొన్న కంకులను మాత్రమే తినేవి. ఇప్పుడు వరి కంకులను, చివరికి పత్తి కాయలను కూడా నమిలేస్తున్నాయి. అన్ని ఊళ్లలో వీటి సంఖ్య బాగా పెరిగిపోయింది. సంవత్సరం క్రితం శాస్త్రవేత్తలు ఇచ్చిన ఆర్తనాదాల యంత్రాన్ని 8 ఎకరాల వరి పొలంలో పెట్టా. అడవి పందులు రాలేదు. పొలం చుట్టూ వేసుకోవటానికి ఫెన్సింగ్‌ జాలీని ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వాలి. కొరకరాని కొయ్యలుగా మారిన అడవి పందులను చంపటమే శాశ్వత పరిష్కారం.

Credits : https://www.sakshi.com/news/family/wild-pigs-and-monkeys-get-sick-946246

భూమి బాగుంటేనే రైతు బాగుండేది!

The farmer would be good if the land was good! - Sakshi

నాలుగేళ్లుగా మామిడి తోటలో దుక్కి చేయలేదు

సొంత విత్తనంతోటే వరి సాగు

ప్రకృతి సేద్యంతో ఆదర్శంగా నిలుస్తున్న రైతు రాములు

ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పెరుగుతున్న  పెట్టుబడులతో రైతులకు ఆదాయం రాక, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వ్యవసాయం అంటేనే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఉన్న వనరులతోనే అధిక నికరాదాయం పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయదారుడు మిట్టపెల్లి రాములు. భూమిని రసాయనాలతో పాడు చేయటం మాని.. జీవామృతంతో సారవంతం చేస్తే వ్యవసాయదారుడి జీవితం ఆనందంగా ఉంటుందని చాటిచెబుతున్నారు.

నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతు సంతోషంగా ఉంటాడనడానికి మిట్టపెల్లి రాములే నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌  మండలంలోని తుంగూర్‌ గ్రామమే రాములు స్వస్థలం. దుబాయ్‌ వెళ్లి 15 ఏళ్లు కార్మికుడిగా పనిచేసి 20 ఏళ్ల క్రితమే తిరిగి వచ్చారు. అప్పట్లోనే గ్రామంలో దాదాపు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిని చదును చేయించి, 10 ఎకరాల మామిడి తోటలో 600 చెట్లు నాటారు. రెండెకరాల్లో వరిని రసాయనిక పద్ధతిలో సాగు చేశారు. రెండు బావులు తవ్వారు.

బంగెనపల్లి, దశేరి, హిమాయత్, కేసరి వంటి మామిడి చెట్లతోపాటు ఉసిరి, జామ, బొప్పాయి, బత్తాయి, మునగ తదితర చెట్లు ఉన్నాయి. ‘సాక్షి సాగుబడి’ ద్వారా పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలుసుకొని, కరీంనగర్‌లో జరిగిన పాలేకర్‌ శిక్షణకు హాజరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి అక్కడ కొందరు రైతుల క్షేత్రాలను పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. నాలుగేళ్లుగా అనుసరిస్తున్నారు. మామిడి తోటలకు జీవామృతాన్ని వర్షాకాలం ప్రారంభం నుంచి నెలకోమారు ఇస్తుంటారు. దోమ ఎక్కువగా ఉన్నప్పుడు అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు.

దశపర్ణ కషాయాన్ని పూత దశకు ముందు పిచికారీ చేస్తారు. అలాగే, వరి సాగుకు ముందు.. జనుము పెంచి పొలంలో కలియ దున్నుతారు. బీజామృతం తయారు చేసి విత్తనాలను విత్తనశుద్ధి చేస్తారు. నాటు వేసే ముందు ఎకరానికి క్వింటాల్‌ ఘన జీవామృతం వేస్తారు. 20 రోజులకొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తుంటారు. ఇటీవల తయారు చేస్తున్న వర్మీవాష్‌ను లేత మామిడి మొక్కలకు అందిస్తున్నారు. గతంలో 2 ఆవులను కొన్నారు. ఇప్పుడు వాటి సంతతి 20కి పెరిగాయి. ఒక్కో ఆవును ఉదయం ఓ మామిడి చెట్టు నీడన, సాయంత్రం ఓ చెట్టు దగ్గర కట్టేస్తుంటారు.

చెట్ల చుట్టూ ఉండే పచ్చిగడ్డిని తినటంతోపాటు పేడ, మూత్రం విసర్జించటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాయి. నీటి నిల్వ కోసం గుంతను తవ్వారు. జీవామృతం నేరుగా డ్రిప్‌ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా ఏనాడూ మామిడి తోటను ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నలేదు. సొంత వరి విత్తనాన్నే వాడుతున్నారు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. మర ఆడించి నేరుగా వినియోగదారులకు బియ్యం అమ్ముతున్నారు. మామిడి కాయలను తోట దగ్గరే అమ్ముతున్నారు. ఎడాపెడా ఖర్చులు పెట్టాల్సిన పని లేకుండా.. హైరానా పడకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేస్తూ.. రసాయనిక అవశేషాల్లేని దిగుబడితోపాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.

రైతును నిశ్చింతగా బతికించేది ప్రకృతి వ్యవసాయమే!
ప్రకృతి వ్యవసాయం పరిచయం అయిన తర్వాత గత నాలుగేళ్లుగా రసాయనాలు వాడలేదు. ఈ ఏడాది అందరి వరి పొలాలకు దోమ పోటు వచ్చినా మా పొలానికి ఏ చీడపీడా రాలేదు. నాలుగేళ్లుగా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. నన్ను చూసి మా గ్రామంలో నలుగురు, ఐదుగురు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే రైతు నిశ్చింతగా బతకగలిగేది. తరచూ మా తోటను సందర్శిస్తున్న రైతులకు నా అనుభవాలను పంచుతున్నాను.

– మిట్టపెల్లి రాములు (81878 23316), తుంగూరు, బీర్‌పూర్‌(మం.), జగిత్యాల జిల్లా

Credit : https://www.sakshi.com/news/family/farmer-would-be-good-if-land-was-good-954471

మట్టే మన ఆహారం!

Earthworm is the pulse of the soil - Sakshi

భూమండలాన్నిభద్రంగా చూసుకోవటం..

మన కాలి కింది నేలతోనే ప్రారంభమవుతుంది!

మన పంట భూముల్లో మట్టి ఎంత సజీవంగా, సారవంతంగా ఉంటుందో మనం తినే ఆహారం కూడా అంత ఆరోగ్యదాయకంగా, సకల పోషకాలతో కూడి ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ సాయిల్‌ మైక్రో బయాలజిస్ట్,      ఎకో సైన్స్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (చెన్నై) అధినేత డా. సుల్తాన్‌ ఇస్మాయిల్‌.

రసాయనిక వ్యవసాయంతో భూమి కోల్పోయిన సారాన్ని తిరిగి సహజసిద్ధంగా పెంపొందించడానికి.. భూమి కోతను, భూతాపం పెరుగుదలను అరికట్టడానికి పంట పొలాల్లోకి స్థానిక జాతుల వానపాములను తిరిగి ఆహ్వానించటం అత్యుత్తమ పరిష్కారమని ఆయన చెప్పారు. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా నిలిపివేసి.. పశువుల పేడ, మూత్రాలను నీటితో కలిపి పొలంలో పారించడం ద్వారా స్థానిక జాతుల వానపాములను తిరిగి సాదరంగా ఆహ్వానించవచ్చని, భూసారాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనంలో ఆయన భూసారం పెంచుకునే మార్గాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

► భూగోళం విస్తీర్ణంలో 75% నీరు, 25% భూమి ఉంది. ఈ భూమిలో సగం మనుషులకు పనికిరాదు. పనికొచ్చే భూమిలో.. 75% భూమి మాత్రమే సాగుయోగ్యమైనది. అంగుళం పైమట్టి(టాప్‌ సాయిల్‌) ఏర్పడటానికి 250 ఏళ్లు పడుతుంది. కాబట్టి, మట్టి వానకు గాలికి కొట్టుకుపోకుండా చూసుకోవటం చాలా ముఖ్యం.

► భూమిలో 45% ఖనిజాలు, 25% గాలి, 25% నీరు ఉంటాయి. భూమి సారవంతంగా ఉండాలంటే కనీసం 5% సేంద్రియ పదార్థం(ఆర్గానిక్‌ కార్బన్‌) ఉండాలి (ఇందులో 80% జీవనద్రవ్యం, 10% వేర్లు, 10% సూక్ష్మజీవరాశి ఉండాలి). కానీ, మన దేశ పంట భూముల్లో సేంద్రియ పదార్థం 0.4% మాత్రమే ఉంది.

► మట్టిలో ఏయే పోషకం ఎంత మోతాదులో ఉన్నదో(సాయిల్‌ ఫెర్టిలిటీని) చూడటం రసాయనిక ఎరువులు వాడే రైతులకు అవసరం.. అయితే, రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతులు మొత్తంగా నేలతల్లి సమగ్ర ఆరోగ్యాన్ని(సాయిల్‌ హెల్త్‌ని) కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండాలి.

► నేలపైన పడిన ఎండిన గడ్డీ గాదాన్ని, రాలిన కొమ్మా రెమ్మలను సూక్ష్మజీవులు, చెద పురుగుల సాయంతో కుళ్లింపజేయటం.. విత్తనాలను మాత్రం కుళ్లబెట్టకుండా మొలకెత్తించటం నేలతల్లి విజ్ఞతకు, విచక్షణకు నిదర్శనం.

► వర్మీకంపోస్టు తయారు చేసే టబ్‌/కంటెయినర్‌కు పైన చిన్న బక్కెట్‌ వేలాడగట్టి చుక్కలు,చుక్కలుగా నీరు పడేలా ఏర్పాటు చేస్తే.. ఆ టబ్‌/కంటెయినర్‌ కిందికి వచ్చే పోషక ద్రవమే వర్మీవాష్‌. దీన్ని పంటలపై చల్లితే మంచి దిగుబడులు వస్తాయి.

► పెద్ద చెట్టు దగ్గర కర్బన నిల్వలు మెండుగా ఉంటాయి. దగ్గర్లో ఉండే మొక్కలు, చిన్న చెట్ల వేరు వ్యవస్థతో పెద్ద చెట్లు తమ వేరు వ్యవస్థలోని మైసీలియా వంటి శిలీంధ్రాల ద్వారా సంబంధాలను కలిగి ఉంటుంది. చిన్న చెట్లు బలహీనంగా ఉన్నప్పుడు.. పెద్ద చెట్లు కర్బనాన్ని భూమి లోపలి నుంచే శిలీంద్రాల ద్వారా చిన్న చెట్లకు అందిస్తాయి. రాలిన చెట్ల ఆకుల్లో సకల పోషకాలుంటాయి. వీటిని తిరిగి భూమిలో కలిసేలా చేయాలి. తగులబెట్టకూడదు. ఎండిన ఆకుల్లో కర్బనం ఉంటుంది, ఆకుపచ్చని ఆకుల్లో నత్రజని ఉంటుంది.

► మన దేశంలో 500 జాతుల వానపాములు ఉన్నా.. వీటిలో ముఖ్యమైనవి మూడే స్థానిక జాతులు: భూమి పైనే ఉండేవి, భూమి లోపల ఉంటూ రాత్రిపూట బొరియలు చేసుకుంటూ పైకీ కిందకు తిరిగేవి, భూమి అడుగున ఉండేవి. స్థానిక జాతుల వానపాముల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి పంటలకు వాడొచ్చు. కర్బనంతో కూడిన మట్టిని, పేడను తిని.. దాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో నత్రజనిని జోడించి.. పోషకాలతో కూడిన పదార్థాన్ని వానపాములు విసర్జిస్తాయి.

► నేలపైన ఆవు పేడ కల్లు వేసిన తర్వాత ఆ పేడ చెక్కుచెదరకుండా పిడక మాదిరిగా ఎండిపోతే దాని కింద ఉన్న భూమి నిర్జీవమైపోయిందని గ్రహించాలి. అలా కాకుండా.. పేడ కల్లు చివికినట్లు అయిపోయి, దాని అడుగున బొరియలు ఉంటే.. ఆ భూమి సారవంతంగా ఉన్నదని అర్థం.

► దేశీ జాతుల ఆవులు, ఇతర పశువుల కొట్టం(షెడ్‌)ను నీటితో కడిగి శుభ్రం చేసినప్పుడు పేడ, మూత్రం కలిసిన నీరు బయటకు వెళ్లిపోతుంది. దీన్ని వృథాగా పోనీయకుండా.. ఒక గుంతలోకి పట్టి ఉంచుకోవాలి. ఈ నీటిని 10%, బోరు నీరు 90% కలిపి పొలానికి పారించాలి. మట్టిలో సూక్ష్మజీవరాశి, వానపాముల సంతతి పెరిగి భూమి సారవంతమవుతుంది.

► రాత్రి వేళల్లో వానపాములు భూమికి బొరియలు చేస్తాయి. ఈ బొరియల ద్వారా వాన నీరు, ప్రాణవాయువు వేర్లకు, భూమిలోపలి జీవరాశికి అందుతాయి.

► బరువైన యంత్రాలు పొలంలో తిరిగితే భూమి చట్టుబడిపోతుంది. భూమిలో సూక్ష్మజీవరాశి, వానపాములు, ఇతర చిరుజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.

► వానపాములు మన పంట భూముల్లో మళ్లీ తారాడేలా చేయటం(రీవార్మింగ్‌) ద్వారా భూమి ఆరోగ్యాన్ని.. తద్వారా సేంద్రియ ఆహారం ద్వారా మనుషుల, పశువుల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. పనిలో పనిగా భూతాపాన్ని(గ్లోబల్‌ వార్మింగ్‌ను) నిలువరించవచ్చు! www.erfindia.org.

Credits : https://www.sakshi.com/news/family/earthworm-pulse-soil-958293

ప్రమాదపు అ౦చున అమెరికా స‍౦యుక్త రాష్ట్రాల నైరుతీ ప్రా౦త సతతహరిత అరణ్యాలు

సారా౦శ౦ :  వాతావరణ మార్పు నేపథ్య౦లో జరిగిన విస్తృత విశ్లేషణలో పరిశోధకులు అమెరికా స‍౦యుక్త రాష్ట్రాల యొక్క నైరుతీ ప్రా౦త౦లోని సతతహరిత అరణ్యాలయొక్క భయ౦కర భవిష్యత్తు గురి౦చి తెలిపారు. క్షేత్రస్థాయి నివేదికలు, ప్ర్రా౦తీయ అ౦చనాలు మరియు క౦ప్యూటర్ నమూనాలను ఉపయోగి౦చి,ఈ అడవులు 2050 నాటికి 70 శాత౦ మరియు 2100 నాటికి 100 శాత౦ నష్టపోతాయని అ౦చనా.

పూర్తి కథన౦ : 

గ్లోబల్ వార్మి౦గ్ నేపథ్య౦లోని అ౦చనాల ప్రకార౦, 2100 నాటికి మెరికా స‍౦యుక్త రాష్ట్రాల యొక్క నైరుతీ ప్రా౦త౦లోని సతతహరిత అరణ్యాలలోని నీడిల్ లీఫ్ సతత హరిత వృక్షాలు మరణిస్తాయని నేచర్ క్లైమేట్ చే౦జ్’ అనే పత్రికలో ప్రచురి౦చబడిన ఒక పరిశోధనా పత్ర౦లో తెలుపబదినది.

గ్లోబల్ వార్మి౦గ్ నేపథ్య౦లోని అ౦చనాల ప్రకార౦, 2100 నాటికి మెరికా స‍౦యుక్త రాష్ట్రాల యొక్క నైరుతీ ప్రా౦త౦లోని సతతహరిత అరణ్యాలలోని నీడిల్ లీఫ్ సతత హరిత వృక్షాలు మరణిస్తాయని నేచర్ క్లైమేట్ చే౦జ్ అనే పత్రికలో ప్రచురి౦చబడిన ఒక పరిశోధనా పత్ర౦లో తెలుపబదినది.

ఈ పరిశోధనా బృ౦ద౦లో డెలావర్ విశ్వవిద్యాలయనికి చె౦దిన ప్రొఫెస్సర్ సారా రౌసెర్ కూడా ఉన్నారు.  పై అ౦చనాలకొరకు ఈ బృ౦ద౦ క్షేత్రస్థాయి ఫలితాలు, విభిన్న ప్రా౦తీయ అ౦చనాలు మరియు వివిధ స౦క్లిష్టతల ప్రప౦చ‌ అనుకరణ నమూనాలను పరిగణలోకి తీసుకున్నారు.

” మేము ఈ సమస్యను ఏ విధ౦గా పరిశోధి౦చినా కూడా మాకు ఒకే ఫలిత౦ వచ్చి౦ది. ఈ ఏకాభిప్రాయ౦ మాకు ఈ అటవీ వృక్షాల‌ మరణాల అ౦చనాలో నమ్మక౦ కలిగిస్తు౦ది ” అని డెలావర్  విశ్వవిద్యాలయ౦లోని కాలేజ్ ఆఫ్ ఎర్త్,ఓషన్ అ౦డ్ ఎన్విరాన్మె౦ట్ లో భూగోళ శాస్త్ర౦ అసిస్టె౦ట్ ప్రొఫెస్సర్ సారా రౌసెర్ తెలిపారు

నైరుతి U.S. ఒక అర్ధ-శుష్క ప్రాంతం, ఇందులో అరిజోనా మరియు న్యూ మెక్సికో, కాలిఫోర్నియా, కొలరాడో, ఉతా మరియు టెక్సాస్లోని ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. యు.ఎస్ డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్ ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం, కేవల౦  అరిజోనా మరియు న్యూ మెక్సికోలలో 20 మిలియన్ల ఎకరాల విస్తీర్ణంలో 11 జాతీయ అరణ్యాలు ఉన్నాయి.

స‍౦యుక్త రాష్ట్రాల యొక్క నైరుతీ ప్రా౦త౦లో విస్తృత అటవీ నష్టం వాతావరణానికి అదనపు కార్బనును జోడిస్తు౦ది. తద్వారా గోబల్ వార్మి౦గ్ మరి౦త పెరుగుతు౦ది. ఎందుకంటే చెట్లు, పొదలు మొదలగు వృక్షస౦పద వాతవరణ౦లోని కార్బనును బ౦దిచి ఉ౦చుతాయి. తక్కువ వృక్షాలు తక్కువ కార్బన్ ను స౦గ్రహిస్తాయి. తద్వారా వాతావరణ‌ మార్పును వేగవంతం చేయగల ప్రతికూల ప్రతిస్పందన వలయ౦ సృష్టి౦చబదుతు౦ది అని రౌసెర్ చెప్పారు.

నైరుతీ ప్రా౦త౦లో ఇటీవలి కరువులు కరువు-నిరోధక జాతులలో కూడా గణనీయమైన వృక్షాల‌ మరణాన్ని కలిగించాయి. ఇటీవలి 2002‍&03 ఉదాహరణలో లాస్ అలమోస్ శాస్త్రవేత్తలు పైనాన్ పైన్ మరియు జునిపెర్ వంటి కరువు నిరోధక వృక్షాలు ఎక్కువగా మరణించినట్లు గమనించారు. ఈ అ౦శ౦, ప్రపంచవ్యాప్తంగా చెట్ల మరణాలు పెరుగుతున్నట్లు సూచిస్తున్న‌ ఇటువంటి నివేదికలతో పాటు కలిపి చూసినప్పుడు ప్రస్తుత విషయాలు వాతావరణ మార్పుకు సంబంధించినది కాదో చూసేందుకు శాస్త్ర బృందాన్ని ప్రోత్రహి౦చాయి.

“జునిపెర్ వృక్ష మరణాల సంభావ్యత పెరుగుదల సాధారణంగా కోనిఫెర్లకు ప్రమాదకరమైన స౦కేతాలను సూచిస్తు౦ది, ఎందుకంటే చారిత్రాత్మకంగా కరువులలో జునిపెర్ వృక్షాలు ఇతర కోనిఫెర్ల కంటే చాలా తక్కువ మరణాలు కలిగివుంది” అని పరిశోధకులు ఈ పత్రికలో రాశారు.

లాస్ అలమోస్ జాతీయ ప్రయోగశాలలో పర్యావరణవేత్త మరియు పరిశోధనా పత్ర౦ యొక్క ప్రధాన రచయిత నేట్ మెక్ డొవెల్, అతని సహచరులు న్యూ మెక్సికోలోని పినాన్-జునిపెర్ అడవులలో చెట్లను అధ్యయనం చేశారు. ఒక చదరపు మైలు ప్లాట్లు మూడి౦టిని ఐదు సంవత్సరాల అధ్యయనంలో కరువు పరిస్థితులకు అనుకరిస్తూ , వారు దాదాపు 50 శాతం వర్షాన్ని పరిమితం చేసారు. అధ్యయనం సమయంలో, మూడు ప్లాట్లలోని పరిణితి చె౦దిన‌ పియోన్ పిన్స్ యొక్క 80 శాతం మరణించాయి, ఇతర చెట్లు సంబంధిత కరువు ఒత్తిడి ప్రభావాలను ఎదుర్కున్నాయి.

ఏకకాలంలో, పరిశోధకులు మొక్కలు ఎలా పని చేస్తాయో సూచించడానికి అల్గోరిథంలను ఎలా ఉపయోగించాలో వివరించే అనువంశిక గణాంక నమూనాలు నుండి వృక్షాలను పరిగణించే యాంత్రిక నమూనాలు, గ్లోబల్ వార్మింగ్ నేపథ్య౦లో భవిష్యత్తులో వృక్షాలు కరువుకు ఎలా స్పందిస్తాయో తెలిపే డైనమిక్ నమూనాలు మెదలైన‌ విభిన్న సంక్లిష్టత కలిగిన‌ ప్రపంచ నమూనాల యొక్క కంప్యుటేషనల్ మోడల్ల సూట్ను ఉపయోగించారు

అన్ని నమూనాలు సరాసరి అధ్యయన ఫలితాలు ప్రకారం, నైరుతి యు.ఎస్ ప్రాంతం యొక్క NET అడవులలో 72 శాతం 2050 నాటికి చనిపోతాయి. అలాగే 2100 నాటికి నైరుతి యు.ఎస్ అడవులలో 100 శాతం మరణాలు సంభవిస్తాయి.

అసిస్టె౦ట్ ప్రొఫెస్సర్ సారా రౌసెర్ మరియు లాస్ అలమోస్ జాతీయ ప్రయోగశాలలో సిబ్బంది శాస్త్రవేత్త మరియు పోస్ట్ డాక్టోరల్ శాస్త్రవేత్త అయిన జియోయోయాన్ జియాంగ్ ఈ ప్రాజెక్టుపై పని చేయడం మొదలుపెట్టి ఎనిమిది వేర్వేరు అనుకరణలను, అంతేకాక విభిన్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉపయోగించి ప్రపంచ వాతావరణ నమూనా ప్రయోగాన్ని రూపకల్పన చేశారు.

” వాతావరణం మరియు వృక్షాలు ఎలా ప్రతిస్పందిస్తాయి, వాటి భవిష్యత్తు ఎలా ఉ౦టు౦ది అని అ౦చనాలను ఉత్పత్తి చేసే విధంగా ఒక మోడల్ ఎలా తయారుచేయాలో మేము గుర్తించాల్సి వచ్చి౦ది. ఇది చేయుటకు, మేము ఇతర నమూనాలు ఊహించిన సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత నమూనాలను ఉపయోగించాము. ఎ౦దుక౦టే సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత ఒక గ్లోబల్ వార్మింగ్ ప్రపంచంలో వర్షపాతం ఎలా మారుతుందనే విషయాన్ని అ౦చనా వేయడ౦లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది” అని రౌసెర్ తెలిపారు

ప్రతి అనుకరణ విభిన‌ రకాల అవక్షేపణ నమూనాలను ఉత్పత్తి చేసినప్పటికీ, వాతావరణ నమూనాలు మాత్ర౦ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నాయి: విస్తృత వృక్షాల‌ మరణం.

రౌసెర్ ప్రకార౦,ఈ పరిశోధన‌ చెట్ల‌ మరణాల యొక్క పరిశీలనా సమాచార౦ మరియు స౦క్లిష్టతతో కూడిన పలు నమూనాల ఫలతాలతో కలిపిన పరిశోధనలలో మొదటిది కావచ్చు. ఈ నమూనాలు గ్రీన్హౌస్ వాయువు ఉద్గారాలకు సంబంధించిన అతి భయంకరమైన దృష్టాంతాలు.

“అమెరికాలోని ఈ ప్రాంతంలో ఇతర ప్రదేశాలలో కనిపించని పాండేరోసా పైన్ వంటి అనేక చారిత్రాత్మక చెట్లతో ఉన్న అందమైన, పాత అడవులు ఉన్నాయి . వృక్ష రహిత నైరుతి ప్రా౦త౦ కేవల౦ భూభాగంపై మాత్రమే కాకుండా, మొత్తం పర్యావరణ వ్యవస్థకు ఒక ప్రధాన మార్పుగా ఉంటుంది” అని రౌసెర్ అన్నారు.”మన౦ కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లయితే మరియు వాతావరణ మార్పును సమగ్ర౦గా ఎదుర్కొన్నట్లయితే, అప్పుడు బహుశా ఈ భయంకరమైన అంచనాల ను౦చి తప్పి౦చుకోవచ్చు.”

కార్ఛిచ్చుల తీవ్రత మరియు తరచుదన౦, పురుగుల జనాభా త్వరణ౦, విత్తనాలు మొలకెత్తడ౦లో విఫలమవ్వడ౦ మొదలగునవి అంచనాలను ప్రభావితం చేయగలవ‌ని పరిశోధకులు చెప్పారు.