తేనెటీగల పెంపకం.. లాభాలు మధురం

 • విజయరాయిలో వందలాది మందికి శిక్షణ ఏటా విస్తరిస్తున్న పెంపకం 
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చేపట్టేవారు. అడవులు తగ్గిపోయి పచ్చదనం లోపించడం, పరిశ్రమలు పెరిగిపోవడం, పొలాల్లో రసాయనాల వాడకం పెరిగిపోవడం తేనెటీగ ల పెంపకానికి అవరోధంగా మారింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్తరకం పనిముట్లు, ప్రక్రియలు అందుబాటులోకి రావటంతో క్రమంగా ఇది పూర్తిస్థాయి వృత్తిగాను, పారిశ్రామిక స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం రైతులతో పాటు నిరుద్యోగులు శిక్షణానంతరం ఈ పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అభివృద్ధి సాధిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు కూడా తేనెటీగల పెంపకం వరంగా మారింది. ఆంధ్రప్రదేశలో 700 మంది తేనెటీగల పెంపకం చేస్తున్నారు. పశ్చిమగోదావరిలో 100 మంది, కృష్ణాజిల్లాలో 200 మంది, గుంటూరు జిల్లాలో 300 మంది ఈ తేనెటీగల పెంపకాన్ని చేస్తున్నారు. తెలంగాణలో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పెంపకం ప్రారంభమైంది.

తెలుగు రాష్ట్రా‌ల్లో ఒకే కేంద్రం 

పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం విజయరాయిలోని తేనెటీగల పెంపక ం, విస్తరణ కేంద్రంలో తేనెటీగల పెంపకంపై రైతులకు, నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు.ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్‌ ఆధ్వర్యంలో 1981 సంవత్సరంలో రెండు తెలుగు రాషా్ట్రల ప్రజల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా శిక్షణ ఇచ్చారు. రైతులు, నిరుద్యోగులు, ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన తేనెటీగలను ఈ కేంద్రమే సరఫరా చేస్తుంది. ఈ కేంద్రం ఏర్పాటు చేసిన తొలినాళ్ళలో తేనెటీగల ఉత్పత్తి కూడా ఇక్కడ జరిగేది. అయితే ప్రస్తుతం కేవలం ఈ కేంద్రం తేనెటీగలను రైతుల వద్దనుంచి తెచ్చి సరఫరా చేయటంతో పాటు ఈ పెంపకంపై శిక్షణా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

లాభాల తేనెపట్టు 
ఒక రాణి( పరిపూర్ణమైన ఆడ ఈగ). వేల సంఖ్యలో కూలి ఈగలు (అసంపూర్ణమైన ఆడ ఈగలు) , వందల సంఖ్యలో పోతు(మగ) ఈగలు ఒక గుంపుగా కలిసి ఉండటాన్ని తేనెపట్టు లేదా తేనెతుట్టె అంటారు. తేనె పట్టుకున్న బలాన్ని బట్టి శక్తి సామర్థ్యాలను ఆ పట్టులోని శ్రామిక(కూలి) ఈగల సంఖ్య బట్టి నిర్ధారిస్తారు. ఎన్ని ఎక్కువ శ్రామిక ఈగలు ఉంటే ఆపట్టును బలమైన తేనెపట్టు అంటారు తేనెపట్టుల అభివృద్ధికి, మంచి దిగుబడికి పుప్పొడి, మకరందం ఉండే పుష్పజాతులు అందుబాటులో ఉండాలి. అన్ని ప్రాంతాల్లో ఈ పుష్పజాతులు కొన్ని మాసాల్లో విరివిగా లభించడం వల్ల తేనెదిగుబడి ఎక్కువగా ఉంటుంది. మెట్ట ప్రాంతంలో నువ్వు, ఆవాలు, జనుము, పిల్లిపెసర, దోస, పుచ్చ, కంది మొదలైన పూతల వద్దకు తరలించి మంచి తేనె దిగుబడిని పొందుతున్నారు. వేప, తాడి, జీడిమామిడి, చింత, నల్లమంది, నేరేడు, ములగ, కానుగ, కరక్కాయ, కుంకుడు, నీలగిరి, కొబ్బరి, కాఫీ, నిమ్మ, నారింజ, మామిడి, బూరుగ, ఈత, పామాయిల్‌ చెట్లతో పాటు అపరాల పంటలు ఉన్న ప్రాంతాల్లో తేనెదిగుబడి ఎక్కువగా లభిస్తోంది.
– ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఏలూరు సిటీ

భారీగా సబ్సిడీలు 
విజయరాయిలోని ఈ కేంద్రంలో శిక్షణ పొందిన తర్వాత కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. గ్రామీణ ఉపాధి కల్పనా పథకం ద్వారా జాతీయ బ్యాంకులలో రుణం పొందిన వారికి ఈ పరిశ్రమ ఏర్పాటు చేసిన తర్వాత సబ్సిడీలు అందజేస్తున్నారు. రూ. 10వేలు నుంచి రూ.5 లక్షల వరకు బ్యాంకులు రుణాలు అందిస్తుండగా ఈ పరిశ్రమ స్థాపించిన వారికి ఒసి పురుషులుకు మాత్రం 25 శాతం, మిగిలిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి మహిళలకు అందరికీ 35శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. బ్యాంకు రుణం పొందిన వారికి మాత్రమే ఈ సబ్సిడీలు అందజేస్తారు.

ఉజ్వల భవిత 
విజయరాయిలో ఉన్న రాష్ట్రస్థాయి తేనెటీగల పెంపక విస్తరణ కేంద్రంలో కేవలం శిక్షణా కార్యక్రమాలే నిర్వహిసున్నాం. ప్రస్తుతం తేనెకు మంచి గిరాకీ ఉండడంతో తేనెటీగల పరిశ్రమలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ పరిశ్రమ పట్ల మొగ్గుచూపడంతో రాబోయే రోజుల్లో ఈ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశం ఉంది.

– తేనెటీగల విస్తరణ కేంద్రం అధికారులు వీఎస్‌ రావు, టీవీ రావు

కష్టమైనా లాభదాయకం 
అలవాటులేని వారికి కష్టమైన పరిశ్రమ, కష్టపడి పనిచేస్తే ఈ పరిశ్రమలో మంచి ఫలితాలను పొందవచ్చు. విజయరాయిలో అందించిన శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ శిక్షణతోపాటు ప్రయోగాత్మకంగా రైతుల వద్ద మెలకువలు నేర్చకుంటే తేనెటీగల పరిశ్రమలో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 

Credits : Andhrajyothi

‘వాటర్‌ బడ్జెట్‌’ రైతుకు వరం

వరి, పత్తి, చెరకులాంటి పంటల ఉత్పత్తికి ఎకరాకు సుమారు 60 లక్షల లీటర్ల నీరు ఖర్చవుతుంది. సంవత్సరంలో సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం పడే ప్రాంతాలలో ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు అందుతుందనుకుంటే అందుకు మూడురెట్ల నీటిని ఒక పంటకాలంలోనే మనం వాడుతున్నాం. అంటే ఎకరా వరి పండించడానికి ఆ ఎకరంలో మూడేళ్లు పడిన వర్షపు నీటిని ఒకే పంట కాలంలో వాడుకుంటున్నాం. ఇలా ఐదేళ్లు రెండు పంటల చొప్పున తీసుకుంటే 30 సంవత్సరాలు పడే వర్షపు నీటిని మనం వాడేసినట్టే.

స్థానిక వర్షపాతం, భూమి తత్త్వం, వాననీటి సంరక్షణ ఆధారంగా పంట ప్రణాళిక, సాగు పద్ధతులను రూపొందించుకోవాలి. ఇదే వాటర్‌ బడ్జెట్‌.

– డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త, హైదరాబాద్‌

 

తరచూ కరువు బారినపడి పంట నష్టపోతున్న రైతులను, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక కిలోమీటర్ల దూరం నడిచి, నీళ్లు మోసుకొచ్చే మహిళలను ప్రతి వేసవిలో మనం చూస్తూంటాం. అదే సమయంలో వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు పంటలు మునిగిపోయి రైతులు పంట నష్టపోవడాన్నీ చూస్తున్నాం. వర్షాల కోసం రుతుపవనాల మీద ఆధారపడే భారతలాంటి దేశంలో వాన పడినప్పుడు నీటిని జాగ్రత్తగా సేకరించి దాచుకుని, అవసరమైనప్పుడు వాడుకునే పద్ధతులు చాలా అవసరం. ఎన్నో వందల ఏళ్లుగా మన దేశంలో చెరువులు, కుంటలు లాంటివి ఇందుకోసం ఏర్పాటు చేసుకుని సమర్థంగా నిర్వహిస్తున్న అనుభవాలున్నాయి. అయితే కాలక్రమేణా బోరుబావులు, ఆనకట్టలు, వాటి కాల్వలద్వారా వచ్చే నీటికి అలవాటు పడటంతో ఇవన్నీ పనికిరాకుండా పోయాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం.
ఒక మిల్లీమీటరు వర్షం కురిసినప్పుడు హెక్టారు భూమిలో సుమారు పదివేల లీటర్ల నీరు చేరుతుంది. అంటే 500 మిల్లీమీటర్ల వర్షం పడే ప్రాంతాలలో కూడా హెక్టారుకు 50 లక్షల లీటర్లు అంటే ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు చేరుతుంది. ఇందులో భూమిలోకి ఇంకిన భాగంగాక మిగిలిన నీరు బయటకు ప్రవహించి మురుగ్గుంటల్లో కలవడమో, ఆవిరి కావడమో జరుగుతున్నది. ఇందులో మూడొంతుల నీటిని కాపాడుకోగలిగితే ఒక పంటను సునాయాసంగా పండించుకోవచ్చు. నేల స్వభావం కారణంగా భూమిలోకి ఇంకే నీటి పరిమాణం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఈ అంశం కూడా భూమిలోకి తక్కువ నీరు చేరడానికి కారణమవుతున్నది. భూమి గట్టిపడటంతో నీరు ఇంకడం తగ్గిపోతున్నది.

భూమి గట్టిపడటానికి కారణాలు

 • భూమిలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం.
 • ట్రాక్టర్‌తో దున్నటంవల్ల గట్టిపొర ఏర్పడటం.
 • పంట కోత యంత్రాల బరువువల్ల నేల గట్టి పడటం.
 • రసాయన ఎరువుల అధిక వాడకం, ఫిల్లర్‌ పదార్థాలవల్ల భూమిలోని సూక్ష్మ రంధ్రాలు, దారులు మూసుకుపోవటం.
 • ఈ అంశాల దృష్ట్యా వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని, భారీ యంత్రాల వినియోగాన్ని తగ్గించుకోవటం అవసరం. అలాగే సేంద్రియ పదార్థాల వినియోగం పెంచుకోవటం వల్ల భూమిలోకి ఎక్కువ నీరు ఇంకేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పంట సరళిలో మార్పు ముఖ్యం
ఆధునిక వ్యవసాయంతో పంటల సరళిలో వచ్చిన మార్పుతో ఎక్కువ నీటి వినియోగం ఉండే పంటల వైపు, సాగు విధానాల వైపు రైతులు మళ్లుతున్నారు. ఉదాహరణకు ప్రస్తుత పద్ధతిలో వరి, పత్తి, చెరకులాంటి పంటల ఉత్పత్తికి ఎకరాకు 60లక్షల లీటర్ల నీరు ఖర్చవుతోంది. ఏడాదిలో 500 మిల్లీమీటర్ల వర్షంపడే ప్రాంతాల్లో ఎకరాకు 20 లక్షల లీటర్ల నీరు అందుతుందనుకుంటే అందుకు మూడు రెట్ల నీటిని ఒక పంటకాలంలోనే ఖర్చుచేస్తు న్నాం. అంటే ఎకరా వరి పంటకు ఆ ఎకరంలో మూడేళ్లు పడిన వర్షపునీటిని ఒకే పంటకు వాడుతున్నాం. ఇలా ఐదేళ్లు రెండు పంటల చొప్పున తీసుకుంటే 30 ఏళ్ల వర్షపునీటిని వాడేసినట్టే. మరోవిధంగా మన పొలం చుట్టుపక్కల 30 ఎకరాల్లో పడిన నీటిని వాడుకున్నట్టే! అందుకే పంట ప్రణాళిక, సాగు పద్ధతులకు స్థానిక వర్షపాతం, భూత త్త్వం, వాననీటి సంరక్షణను ఆధారం చేసుకోవా లి. ఇదే వాటర్‌ బడ్జెట్‌. సగటు వర్షపాతం కో స్తాంధ్రలో1,094, తెలంగాణలో961, రాయలసీమలో 680మిల్లీ మీటర్ల మేర ఉంది. ఇందులో చాలాభాగం వర్షపునీటిని చక్కటి పంట ప్రణాళిక, సాగు పద్ధతులతో సంరక్షించుకోవచ్చు.

ఇందుకోసం రైతులు ప్రధానంగా చేయాల్సింది

 • ఎక్కడ పడిన వర్షం అక్కడే ఇంకటానికి వీలుగా పొలంలో బోదెలకు చిన్నచిన్న అడ్డుకట్టలు వేసుకోవాలి.
 • పొలంలో పల్లం ఉన్న పాంతంలో సుమారు అడుగు వెడల్పు, ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు లోతులో ట్రెంచలు చేసుకోవాలి.
 • వీటి ద్వారా సగం నీరు భూమిలో ఇంకుతుంది అనుకుంటే బయటకు ప్రవహించి, వృథా అయ్యే నీటిని సంరక్షించుకునేందుకు నీటి కుంటలు తవ్వుకోవాలి.
 • వృథాగా పోయే నీటిని నిలబెట్టుకుని, సంరక్షించుకోవటం కోసం అడ్డుకట్టలు కట్టుకోవాలి.
 • వాలుకు అడ్డంగా దున్నుకోవటం, గట్టు వేసుకోవటం, పక్కనే ట్రెంచలు చేసుకోవడం ప్రధానం.
 • భూమిలో సేంద్రియ పదార్థం పెంచుకోవడం కోసం ఎకరాకు కనీసం 4 టన్నుల జీవ పదార్థాలు వేసుకోవాలి.
 • ఈదురు గాలులు, వేడిగాలులవల్ల పెరిగే నీటి ఆవిరిని తగ్గించటం కోసం పొలం గట్లమీద మొక్కలునాటి పెంచాలి.
– డాక్టర్‌ జి.వి.రామాంజనేయులు,
సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త,
హైదరాబాద్‌
Credits : Andhrajyothi

చెమట బొట్టుతో చిగురించే గుట్టలు

 
 • ఖాళీ మినరల్‌ వాటర్‌ క్యాన్లే డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు..
 • శ్రీకారం చుట్టిన కర్ణాటక వ్యక్తి
 • ఐదేళ్ల కష్టం.. వంద చెట్లకు ప్రాణం
 • శ్రీరంగపట్నలోని కరీఘట్ట గుట్టలపై విస్తృతంగా ఆయుర్వేద మొక్కల పెంపకం
బెంగళూరు, జూన్‌ 12: ‘బొట్టు బొట్టు వొడిచిపట్టు’ అనే నినాదాన్ని నిజం చేసి చూపించాడు వై.రమేశ్‌. డ్రిప్‌ ఇరిగేషన్‌లో నూతన ఆవిష్కరణకు ఈ కన్నడ చిరుద్యోగి శ్రీకారం చుట్టాడు. చెట్టు మొదలుపై బొట్టు బొట్టుగా నీళ్లు పడేలా చేసి… పచ్చదనాన్ని తీసుకురావడమే కాదు, ఆ మొదలులోనే విత్తనాలు చల్లి ఆ ప్రాంతాన్నంతా హరితవనంలా మారుస్తున్నాడు. అంతేనా.. రమేశ్‌ చేసిన ఏర్పాటుతో చెట్టుకు మాత్రమే కాక పక్షుల దాహమూ తీరుతోంది. ఇదంతా ఒకటి రెండు రోజుల్లో అయింది కాదు.. ఐదేళ్లపాటు రమేశ్‌ పడిన కష్టం ఈ రోజున వంద చెట్లుగా వర్థిల్లుతోంది.

ఎవరీ రమేశ్‌?

కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన రమేశ్‌ డిగ్రీ చదివాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఓ మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లో ఉద్యోగానికి కుదిరాడు. దైవభక్తుడైన రమేశ్‌ రోజూ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లేవాడు. అప్పుడప్పుడు ఆ పక్కనే ఉన్న కరీఘట్ట గుట్టలపైకి వెళ్లేవాడు. చూస్తే.. ఎండాకాలంలో ఎక్కడా చెట్టు నీడ కనిపించేది కాదు. పచ్చదనం కరువై బోడిగా తయారైన గుట్టలను చూసినప్పుడల్లా రమేశ్‌లో దిగులు ఆవరించేది. ఏదో ఒకటి చేసి, గుట్టపై మిగిలిన ఒకటి అరా చెట్లనైనా బతికించుకోవాలని తాపత్రయపడేవాడు.

గుట్టలకు జీవం 

ఒకనాడు ఖాళీ మినరల్‌ వాటర్‌ క్యాన్లను పాత సామాను స్టోర్‌కు తరలిస్తుండగా ఒక ఆలోచన వచ్చింది. అంతే.. నడుపుతున్న ఆటోని అటునుంచి అటే గుట్టలపైకి మళ్లించాడు. క్యాన్‌ను సగానికి కట్‌ చేశాడు. మూతి ఉన్న భాగం నేలను చూసేలా ఆ క్యాన్‌ భాగాన్ని ప్రతి చెట్టుకూ కట్టాడు. క్యాన్‌లో నీళ్లు పోసినప్పుడు మూతి భాగం నుంచి బొట్టుబొట్టుగా నీటి బిందువులు చెట్టు మొదలుపై పడేలా ఏర్పాటుచేశాడు.

చేతికష్టం ఫలించే..
20 లీటర్ల బరువు ఉండే రెండు క్యాన్లను రమేశ్‌ చెరో చేత్తో పట్టుకొని.. దాదాపు 15 సార్లు గుట్ట ఎక్కి దిగేవాడు. ఉదయాన్నే వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడంతో రమేశ్‌ దినచర్య మొదలవుతుంది. అప్పటికే ఆటోలో నింపిన ఖాళీ మినరల్‌ వాటర్‌ క్యాన్లతో లోకపావని నదిలో నీళ్లు నింపుకొని వీలుంటే ఆటోలో లేదంటే, మోసుకుంటూ గుట్ట ఎక్కుతాడు. ఒక్కో చెట్లు దగ్గర ఆగి నీళ్లు పోస్తూ ముందుకుసాగుతాడు. క్యాన్‌ ఒకసారి నింపితే రెండు, మూడు రోజులకు చెట్టుకు సరిపోయేది. ఈ క్రమంలో తనకొచ్చే ఒక్కో ఆలోచనను అమలు చేస్తూ పోయాడు. చెట్టు మొదలు ప్రాంతాన్ని గుల్ల చేసి ఆయుర్వేద మొక్కలను నాటాడు. మొదలులో పడే నీళ్లతోనే అవీ ఎదిగివచ్చాయి. ఇలా ఐదేళ్లలో వంద చెట్లకు ప్రాణదానం చేశాడు. ఈ క్రమంలో గుట్టంతా పచ్చపడటంతో.. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయిన పక్షులు తిరిగి రావడం మొదలయింది.

తొలి అడుగులో తడబాటు
ఒకరోజు ఐదారు కిలోమీటర్లు విస్తరించిన గుట్టపై ఉన్న చెట్లను పరిశీలించాడు. ఒక్కో చెట్టుకు పాదులు తీస్తూ పోయాడు. అక్కడికి కొంతదూరంలోని లోకపావని నది నుంచి క్యాన్లతో నీళ్లు తెచ్చి పాదుల్లో పోయడం మొదలుపెట్టాడు. పనిలో ఏ కాస్త వెసులుబాటు దొరికినా, చెట్ల పని చేసేవాడు. కానీ, ఆయన ప్రయత్నం ఫలించలేదు. ఏమి చేయాలని మథనపడుతుండగా, ఒకరిద్దరు డ్రిప్‌ ఇరిగేషన్‌ గురించి చెప్పారు. ఆలోచన బాగున్నా తనలాంటి చిరు ఉద్యోగి అంత ఖర్చు భరించడం కష్టం.

Credits : Andhrajyothi

జత కట్టించొచ్చు

              జీవాల కాపలదారులు మార్చి నెలలో ఆచరించవలసిన పద్ధతుల గురించి పశువైద్యులు అందిస్తున్న సూచనలు. వీటిని పాటించడం వల్ల జీవాలు ఎదుర్కొనే వివిధ సమస్యలను నివారించడంతో పాటు అధిక లాభాలు పొందవచ్చు. ఈ సూచనలను ఆయా ప్రాంతాలకు, పరిస్థితులకు అనుకూలంగా పాటించడం మంచిది.

– మార్చి నెలలో పిల్లలు మూడు నెలలు నిండితే తల్లుల నుంచి వేరు చేయాలి.

– గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలిచ్చి ఆరునెలలైతే మళ్ళీ టీకాలిప్పించాలి.

– గొర్రెలు, మేకల్లో నట్టల్ని పరీక్షించాలి. నట్టల నివారణ కషాయాలు తాగించవచ్చు.

– పిడుదులు, గోమార్లు లేకుండా మందులు ఉపయోగించాలి. లేదా గొర్రెల్ని మందు కలిపిన నీళ్ళల్లో తడిపి తీయాలి.

– పిల్లల్లో డయేరియా, త్వరగా పెరగక పోవడం, ఇతర వ్యాధి లక్షణాల గురించి పరిశీలించాలి.

– అమ్మతల్లి వ్యాధి నిరోధక టీకాల్ని వేయించాలి.

– జత కట్టించడం చేయవచ్చు.

– ఉన్ని ఇచ్చే గొర్రెల్లో, ఉన్ని కత్తిరించాలి.

– ఈ నెల నుండి వేసవి మొదలవుతుంది. బీడు భూముల్లో మేత తగ్గిపోవచ్చు. అప్పుడు షెడ్డులో అదనంగా ఎండుమేత, సైలేజీ, దాణా ఇవ్వాలి. పచ్చిమేత ఎక్కువగా ఉంటే, ఎండు మేతగా నిలువ చేయాలి.

Credits : www.prajasakti.com